విజయ పాల సేకరణ ధర లీటరుకు రూపాయి పెంపు

 తెలంగాణ రాష్ట్ర పాడి పరిశ్రమాభివృద్ధి సహకార సమాఖ్య (విజయ డెయిరీ) పాల సేకరణ ధరను లీటరుకు రూపాయి చొప్పున పెంచడానికి నిర్ణయించినట్లు ఆ సంస్థ చైర్మన్‌ లోక భూమారెడ్డి తెలిపారు. ఇప్పటికే ప్రభుత్వం ఇస్తున్న నాలుగు రూపాయల ప్రోత్సాహానికి ఇది అదనమని స్పష్టంచేశారు. దీంతో లక్ష మందికిపైగా పాడి రైతులకు ప్రయోజనం చేకూరుతుందని తెలిపారు. ప్రభుత్వ ప్రోత్సాహకం, ఈ పెంచిన రూపాయితో కలిపితే ఆవుపాలకు లీటరుకు రూ.35, గేదె పాలకు రూ.40 చొప్పున రైతులకు చెల్లిస్తారు.