డిజి లాకర్ సౌకర్యాన్ని కేంద్ర విదేశాంగ శాఖ పాస్‌పోర్ట్‌కు కూడా అందుబాటులోకి తీసుకువచ్చింది. పాస్‌పోర్టు దరఖాస్తుదారులు డిజి లాకర్లో అకౌంట్ క్రియేట్ చేసుకొని.. తమకు సంబంధించిన అన్ని సర్టిఫికెట్లను అందులో దాచుకోవచ్చు. దీని వల్ల పాస్‌పోర్టు కార్యాలయానికి వెళ్లేటప్పుడు సర్టిఫికెట్లను వెంట తీసుకువెళ్లే శ్రమ తప్పుతుంది. ఆన్లైన్లో దరఖాస్తు చేసుకొని.. నేరుగా పాస్‌పోర్టు కార్యాలయానికి వెళ్లి డిజి లాకర్ ఉందని చెబితే చాలు.. డాక్యుమెంట్లను వాళ్లే వెరిఫై చేస్తారు. ఆన్లైన్లో పాస్‌పోర్ట్‌కు దరఖాస్తు చేసుకునే సమయంలోనే డిజి లాకర్ ఆప్షన్ కావాలా? అని అడుగుతుంది. అవసరమని జవాబిస్తే.. మీకు మంజూరయ్యే పాస్‌పోర్ట్ ఒరిజినల్ సైతం డిజి లాకర్లో ఉంచుతారు. దీని వల్ల మన పాస్‌పోర్ట్ ఎక్కడైనా పోతుందేమోననే భయం వదిలిపెట్టవచ్చు.