పుల్వామా ఘటనకు రెండేళ్లు...ప్రధానితో సహా ప్రముఖుల నివాళి

 


ఫిబ్రవరి 14, 2019 న జమ్మూకాశ్మీర్ లోని పుల్వామాలో ఇండియన్ ఆర్మీ కాన్వాయ్ పై ముష్కరులు దాడి చేసిన సంగతి తెలిసిందే. ఈ దాడిలో 40 మంది ఆర్మీ జవానులు మృతి చెందారు. ఆర్మీపై ముష్కరులు జరిపిన దాడిని దేశం యావత్తు ఖండించింది. ఈ దాడి జరిగిన కొన్ని రోజులకు ఇండియా పాక్ సర్జికల్ స్ట్రైక్ చేసింది. ఇండియన్ ఎయిర్ ఫోర్స్ కు చెందిన విమానాలు ఈ సర్జికల్ స్ట్రైక్ లో పాల్గొన్నాయి. పాక్ లోని బాలాకోట్ లోని ఉగ్రవాద స్థావరాలపై ఇండియన్ ఆర్మీ దాడి చేసింది. ఈ దాడిలో వందలాది మంది ముష్కరులు హతమయ్యారు. అయితే, ఇండియన్ ఆర్మీ చెట్లపై బాంబులు వేసి వెళ్లారని పాక్ బుకాయించింది. పుల్వామా ఘటన జరిగి నేటికి రెండేళ్లు పూర్తయింది. ఈ సందర్భంగా ప్రధాని మోడీతో సహా పలువురు ప్రముఖులు ఈ ఘటనలో మరణించిన ఆర్మీ సిబ్బందికి నివాళులు అర్పించారు.