వరుసగా కొన్ని సంవత్సరాలుగా రెండంకెల వృద్ధి

 


స్మార్ట్‌ఫోన్ల విక్రయాలకు కరోనా వైరస్‌ గట్టిగానే తగిలింది. వరుసగా కొన్ని సంవత్సరాలుగా రెండంకెల వృద్ధిని నమోదు చేసుకుంటున్న అమ్మకాలు గతేడాది 2 శాతం పడిపోయాయి. ఇలా అమ్మకాలు పడిపోవడం ఇదే తొలిసారని ఇంటర్నేషనల్‌ డాటా కార్పొరేషన్‌ (ఐడీసీ) వెల్లడించింది. 2020లో 15 కోట్ల మొబైల్‌ ఫోన్లు అమ్ముడయ్యాయి. అంతక్రితం ఏడాది అమ్ముడైన దాంతో పోలిస్తే ఇది 1.7 శాతం తక్కువని ఐడీసీ తెలిపింది. మహమ్మారి కారణంగా ప్రజలు ఇంటిలోనే ఉండటం, ఇంటి నుంచే పనిచేయడం, విద్యా, రవాణాపై నియంత్రణ విధించడం, తయారీ రంగం నిలిచిపోవడంతో గతేడాది తొలి ఆరు నెలల్లో అమ్మకాలపై ప్రభావం చూపాయని పేర్కొంది.