లాక్ డౌన్ తర్వాత ప్రత్యక్ష తరగతులను కొవిడ్ నిబంధనల ప్రకారమే నిర్వహిస్తున్నట్లు రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి అన్నారు. సోమవారం జిల్లాలగూడలోని చల్ల లింగారెడ్డి ప్రభుత్వ హైస్కూల్‌ను ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ విద్యార్థులు తల్లిదండ్రుల అనుమతి పత్రాలతోనే పాఠశాలలకు రావాలని సూచించారు. రాష్ట్రవ్యాప్తంగా పాఠశాల, కళాశాలలకు విద్యార్థులు ఉత్సాహంగా వస్తున్నారని పేర్కొన్నారు. విద్యార్థులు తప్పనిసరిగా హ్యాండ్ వాష్, మాస్క్‌లు పెట్టుకోవాలని, జ్వరం, జలుబు ఉంటే వెంటనే ఉపాధ్యాయుల దష్టికి తీసుకురావాలని సూచించారు. మధ్యాహ్న భోజనంలో తగు జాగ్రత్తలు తీసుకోవాలని ఉపాధ్యాయులను, సిబ్బందిని ఆదేశించారు. అనంతరం మంత్రి విద్యార్థులతో కలిసి మధ్యాహ్న భోజనం చేశారు. కార్యక్రమంలో మీర్పేట్ కార్పొరేషన్ డిప్యూటీ మేయర్ తీగల విక్రమ్ రెడ్డి, ఆర్జేడీ, డీఈఓ, ఎంఈఓ కష్ణయ్య స్థానిక కార్పొరేటర్లు తదితరులు పాల్గొన్నారు.