విక్టరీ వెంకటేశ్, తరుణ్ భాస్కర్‌ కాంబినేషన్ లో సినిమా ...

 


విక్టరీ వెంకటేశ్, తరుణ్ భాస్కర్‌ కాంబినేషన్ లో సినిమా రూపుదిద్దుకోబోతోందనే వార్త కొంతకాలంగా చక్కర్లు కొడుతోంది. నటుడిగా, రచయితగా తరుణ్‌ భాస్కర్‌ బిజీగా ఉంటే, 'నారప్ప, ఎఫ్‌ 3' చిత్రాలతో వెంకటేశ్ బిజీగా ఉన్నారు. అయితే... తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన ఫస్ట్ డ్రాఫ్ట్ ను తరుణ్‌ భాస్కర్‌ పూర్తి చేశాడని తెలిసింది. హార్స్ రైడింగ్‌ నేపథ్యంలో వినోద ప్రధానంగా సాగే ఈ చిత్ర కథకు నిర్మాత సురేశ్‌ బాబు గతంలోనే గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చారు. సో... అతి త్వరలో సినిమా ప్రారంభోత్సవాన్ని జరిపి, జులై నుండి రెగ్యులర్‌ షూటింగ్‌ ప్రారంభించబోతున్నారట.    అన్ని అనుకున్నట్టు జరిగితే... వెంకటేశ్‌ సినిమాలు ఈ యేడాది మూడు జనం ముందుకు వస్తాయి. ప్రస్తుతం తుదిమెరుగులు దిద్దుకుంటున్న 'నారప్ప' చిత్రం మే 14న విడుదల కాబోతుండగా, శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న 'ఎఫ్‌ 3'ని ఆగస్ట్ 27న విడుదల చేస్తామని నిర్మాత 'దిల్‌' రాజు ప్రకటించారు. సో... ఇదే యేడాది ద్వితీయార్ధం చివరిలో వెంకీ - తరుణ్‌ భాస్కర్‌ మూవీ జనం ముందుకు వచ్చే ఆస్కారం ఉంటుంది. మొత్తం మీద మూడు భిన్నమైన కథలతో వెంకటేశ్‌ తన అభిమానులను ఆకట్టుకోబోతున్నారని అనుకోవచ్చు.