మల్టీలెవల్ మార్కెటింగ్‌ పేరుతో చైనా ముఠా భారీ మోసO రంగారెడ్డి: మల్టీలెవల్ మార్కెటింగ్‌ పేరుతో చైనా ముఠా భారీ మోసానికి పాల్పడింది. దేశవ్యాప్తంగా 20 వేల మందికి టోకరా పెట్టినట్లు పోలీసులు గుర్తించారు. వారి నుంచి రూ. 50 కోట్ల మేర స్వాహా చేసుకున్నారు. ముగ్గురు చైనా ముఠా సభ్యులను సైబరాబాద్‌ పోలీసులు అరెస్టు చేశారు. ఈరోజు నిందితులను మీడియా ముందు సైబరాబాద్‌ సీపీ సజ్జనార్ ప్రవేశపెట్టనున్నారు.