కరోనా వైరస్ ల్యాబ్ లో సృష్టించింది కాదని WHO వెల్లడి వూహాన్ మార్కెట్ లో WHO బృందం వెళ్లి కొన్ని పరీక్షలు చేసిన సంగతి తెలిసిందే. అయితే ఈ కరోనా వైరస్ ల్యాబ్ లో సృష్టించింది కాదని WHO పేర్కొంది. దీని మీద మరి కొన్ని పరీక్షలు చేసి మరింత అధ్యయనం చేయాల్సిన అవసరం ఉందని పేర్కొంది. వూహాన్ మాంసం మార్కెట్ లో ఉన్న గడ్డకట్టిన మాంసం నుండి ఈ వైరస్ పుట్టి ఉండవచ్చని WHO చెబుతోంది.కరోనా వైరస్ అసలు ఎక్కడ పుట్టింది ? నేరుగా మనుషులకే సోకిందా ? అనే విషయాలు మాత్రం కనుగొనడంలో విఫలం అయ్యామని WHO పేర్కొంది. నిజానికి ముందు నుండి ఈ వైరస్ కి సంబంధించి రకరకాల ప్రచారాలు జరిగాయి. దీనిని ల్యాబ్ లో తాయారు చేస్తే అనుకోకుండా బయట పడిందని మాంసం మార్కెట్ ద్వారా అది మరింత వ్యాపించింది అని ప్రచారం జరిగింది. అయితే తాజా WHO బృందం పర్యటనతో ఈ విషయాలు వెలుగులోకి వచ్చింది.