తెలంగాణలోని నిరుద్యోగులకు గుడ్ న్యూస్.ఈఎంఆర్ఐ(108) పలు ఉద్యోగాలు.

 


తెలంగాణలోని నిరుద్యోగులకు గుడ్ న్యూస్. ప్రముఖ ఎంఎన్‌సీ సంస్థ జీవీకే ఈఎంఆర్ఐ(108) పలు ఉద్యోగాలను భర్తీ చేసేందుకు నోటిఫికేషన్ ఇచ్చింది. ఎమర్జెన్సీ టెక్నీషియన్ విభాగంలో ఖాళీలు ఉన్నాయని.. ఆసక్తి కలిగినవారు మార్చి 9న ఇంటర్వ్యూలకు హాజరు కావాలని ప్రకటనలో పేర్కొంది. అంతేకాకుండా ఇంటర్వ్యూకు వచ్చేవారు ఒరిజినల్ సర్టిఫికేట్లతో పాటు ఓ సెట్ జిరాక్స్ కాపీలను తీసుకురావాలని సూచించారు. ఉద్యోగాలకు సంబంధించి మిగిలిన వివరాలు… విద్యార్హత: డిగ్రీ(BSc BZC, BSc MLT), డిప్లమో ఇన్ మెడికల్ లాబరేటరీ టెక్నాలజీ మేనేజ్‌మెంట్(DMLT) అర్హులు: ఫ్రెషర్స్, ఏడాది అనుభవం ఉన్నవారు వయస్సు: 21-30 ఇతరత్రా అర్హతలు: తెలుగు, ఇంగ్లీష్, హిందీ భాషలు మాట్లాడటం, రాయడం తెలిసి ఉండాలి ఇంటర్వ్యూ సమయం : ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు