ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్.15.60 లక్షల ఇళ్ల నిర్మాణానికి సీఎం జగన్‌ అంగీకారం .

 


అమరావతి: స్పందనపై జిల్లా కలెక్టర్లు, ఎస్పీలతో సీఎం జగన్ వీడియోకాన్ఫరెన్స్‌ నిర్వహించారు. యుద్ధప్రాతిపదికన గ్రామ సచివాలయాల నిర్మాణాలు చేపట్టాలని సీఎం ఆదేశించారు. మిగిలిపోయిన ఇళ్ల పట్టాల పంపిణీని పూర్తి చేయాలని అధికారులకు ఆదేశించారు. తొలి విడతలో 15.60 లక్షల ఇళ్ల నిర్మాణానికి సీఎం జగన్‌ అంగీకారం తెలిపారు. ఏప్రిల్‌ 15 నుంచి నిర్మాణ పనులు ప్రారంభం కానున్నట్లు తెలిపారు.