165 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించిన ఇంగ్లాండ్ టీమిండియా గెలుపు కోసం 165 పరుగులు చేయాలి.

 


అహ్మదాబాద్‌లో ఇంగ్లండ్‌తో జరిగిన రెండో టీ 20 మ్యాచ్‌లో టాస్ గెలిచిన భారత కెప్టెన్ విరాట్ కోహ్లీ బౌలింగ్ ఎంచుకున్నాడు. భారత జట్టులో 2 మార్పులు మాత్రమే ఉన్నాయి. శిఖర్ ధావన్, అక్షర్ పటేల్ ఈ మ్యాచ్‌లో ఆడటం లేదు. ఇషాన్ కిషన్, సూర్యకుమార్ జట్టులోకి వచ్చారు. జట్ల వివరాలు ఇండియా- విరాట్ కోహ్లీ (కెప్టెన్), కెఎల్ రాహుల్, శ్రేయాస్ అయ్యర్, హార్దిక్ పాండ్యా, రిషబ్ పంత్ (వికెట్ కీపర్), వాషింగ్టన్ సుందర్, భువనేశ్వర్ కుమార్, శార్దుల్ ఠాకూర్, ఇషాన్ కిషన్, సూర్యకుమార్ యాదవ్, యుజ్వేంద్ర చాహల్. ఇంగ్లాండ్ – ఇయాయిన్ మోర్గాన్ (కెప్టెన్), జోఫ్రా ఆర్చర్, టామ్ కరణ్, జానీ బెయిర్‌స్టో, జోస్ బట్లర్ (వికెట్ కీపర్), సామ్ కరణ్, క్రిస్ జోర్డాన్, డేవిడ్ మలన్, ఆదిల్ రషీద్, జాసన్ రాయ్, బెన్ స్టోక్స్. బ్యాటింగ్ బలంగా ఉంది, కానీ బౌలర్ల కొరత ఉంది టీం ఇండియాలో ఇద్దరు కొత్త ఆటగాళ్ళు ప్రవేశించారు. ఓపెనింగ్ బాధ్యతను ఇషాన్ కిషన్‌కు ఇవ్వగా, అక్షర్ పటేల్ స్థానంలో సూర్యకుమార్ యాదవ్‌ను చేర్చారు. అంటే, ఈ రోజు భారత్ తన బలమైన బ్యాటింగ్ లైనప్‌తో దిగుతోంది. అయితే కేవలం 5 బౌలర్లతో భారత్ బరిలోకి దిగుతుందని గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. LIVE NEWS & UPDATES 14 MAR 2021 21:59 PM (IST) వంద పరుగులు పూర్తి చేసుకున్న టీమిండియా.. ఇషాన్‌ కిషన్‌, విరాట్‌ కోహ్లి భాగస్వామ్యంతో టీమిండియా మంచి స్కోరు దిశగా పరుగులు పెట్టింది. అయితే ఇషాన్‌ అర్థ సెంచరీ చేసి అవుట్‌ అయిన విషయం తెలిసిందే. ఇక ఈ క్రమంలోనే టీమిండియా 100 పరుగులు మార్క్‌ను చేరుకుంది. ప్రస్తుతం టీమిండియా స్కోర్‌ 109/2 వద్ద కొనసాగుతోంది. క్రీజులో కోహ్లి (40), పంత్‌ (10) పరుగుల వద్ద కొనసాగుతున్నారు. 14 MAR 2021 21:53 PM (IST) సంతోషపడే లోపే వికెట్‌.. వెనుదిరిగిన ఇషాన్‌.. హాఫ్‌ సెంచరీతో టీమిండియా స్కోరును పరుగులు పెట్టిస్తూ హాఫ్‌ సెంచరీ పూర్తి చేసుకున్న ఇషాన్‌ కాసేపటికే అవుట్‌ అయ్యాడు. 9.6 ఓవర్‌ వద్ద రషీద్‌ విసిరిన బంతికి ఇషాన్‌ (56) వికెట్ల ముందు దొరికిపోయాడు. ప్రస్తుతం టీమిండియా స్కోర్‌.. 94/2. రిషబ్‌ పంత్‌ క్రీజులోకి వచ్చాడు. 14 MAR 2021 21:48 PM (IST) జస్ట్‌ మిస్‌… లైఫ్‌ కొట్టేసిన ఇషాన్‌.. హాఫ్‌ సెంచరీ పూర్తి.. ఇషాన్‌ కిషన్‌ బిగ్‌ లైఫ్‌ను పొందాడు. రషీద్‌ వేసిన బంతిని ఇషాన్‌ లాంగ్‌ ఆన్‌ వైపునకు కొట్టాడు. దీంతో అక్కడ ఉన్న స్టోక్స్‌ చేతుల్లోకి బంతి వెళ్లినప్పటికీ ఈజీ క్యాచ్‌ను జారవిడిచాడు. ఈ రకంగా ఇషాన్‌ లైఫ్‌ పొందాడు. ఈ క్రమంలోనే తనకు దొరికిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్న ఇషాన్‌ హాఫ్‌ సెంచరీ పూర్తి చేశాడు. ఇషాన్‌ ప్రస్తుతం 54 (30) పరుగుల వద్ద కొనసాగుతున్నాడు. 14 MAR 2021 21:38 PM (IST) ఫ్రీ హిట్‌ను సిక్స్‌గా మలిచిన కోహ్లి.. img విరాట్‌ కోహ్లీ ఫ్రీ హిట్‌ను బాగా సద్వినియోగం చేసుకున్నాడు. బెన్‌ స్టోక్స్‌ నోబ్‌ వేయడంతో అనుకోకుండా ఫ్రీ హిట్‌ లభించింది. దీంతో దీంతో విరాట్‌ స్టోక్స్‌ వేసిన బంతిని బౌండరీ దాటేశాడు. ప్రస్తుతం టీమిండియా స్కోర్‌ ఏడు ఓవర్లకు గాను ఒక వికెట్‌ కోల్పోయి 73 పరుగుల వద్ద కొనసాగుతోంది. 14 MAR 2021 21:32 PM (IST) 50 పరుగులు పూర్తి చేసుకున్న టీమిండియా.. మొదటి ఓవర్‌లోనే రాహుల్‌ రూపంలో వికెట్ కోల్పోయిన టీమిండియాను కోహ్లి, ఈశాన్‌ కిషాన్‌ ఆదుకునే పనిలో పడ్డారు. ఆచిచూతి ఆడుతూ జట్టు స్కోరును పరుగులు పెట్టిస్తున్నారు. ఈ క్రమంలోనే టీమిండియా ఆరు ఓవర్లకుగాను 50 పరుగులు పూర్తి చేసుకుంది. ప్రస్తుతం క్రీజులో కోహ్లి (24), కిషన్‌ (27) పరుగులతో కొనసాగుతున్నారు. 14 MAR 2021 21:23 PM (IST) రాహుల్‌కు సలహా ఇచ్చిన మంజ్రేకర్‌.. వరుసగా 2 మ్యాచ్‌లో విఫలమవడం పట్ల టీమిండియా ఓపెనర్‌ కేఎల్‌ రాహుల్‌కు సంజయ్‌ మంజ్రేకర్‌ ట్విట్టర్‌ వేదికగా ఓ సలహా ఇచ్చాడు. ‘రాహుల్‌ ఇకపై నువ్వు బంతిని చూసి షాట్‌కు ప్రయత్నించు. అలా చేస్తేనే నువ్వు టీ20లో ఉత్తమమైన ప్రతిభను కనబరుస్తావు’ అంటూ ట్వీట్‌ చేశాడు. 14 MAR 2021 21:14 PM (IST) మొదటి ఓవర్‌లోనే తొలి వికెట్‌ కోల్పోయిన భారత్‌.. img 165 పరుగుల లక్ష్యంతో ఇన్నింగ్స్‌ భారత్‌కు తొలి ఓవర్‌లోనే దెబ్బ తగిలింది. ఓపెనర్ కేఎల్‌ రాహుల్ డకౌట్‌ అయ్యి నిరాశపరిచాడు. సామ్‌కరన్‌ వేసిన తొలి ఓవర్‌ ఐదో బంతికి కీపర్‌కు క్యాచ్‌ ఇచ్చి వెనుదిరిగాడు. 14 MAR 2021 20:53 PM (IST) షార్దుల్ స్టోక్స్ ను అవుట్ చేశాడు చివరి ఓవర్లో కూడా భారత్‌కు మంచి బ్రేక్ లభించింది. స్టోక్స్ షార్దుల్ బంతిని లాంగ్ ఓవర్ తీసుకోవడానికి ప్రయత్నించాడు, కానీ బంతి బౌండరీ దాటలేదు హార్దిక్ ఈజీ క్యాచ్ తీసుకున్నాడు. 14 MAR 2021 20:52 PM (IST) 19 ఓవర్లు పూర్తయ్యాయి, ఇంగ్లాండ్ – 158/5 చివరి కొన్ని ఓవర్ల నుంచి బౌండరీని పొందడానికి ప్రయత్నిస్తున్న బెన్ స్టోక్స్ చివరకు విజయం సాధించాడు. స్టోక్స్ భువనేశ్వర్ వేసిన ఓవర్‌లోని ఐదవ బంతిని నేరుగా బౌండరీకి ​​పంపాడు. ఈ ఓవర్ లో 9 పరుగులు వచ్చాయి. 14 MAR 2021 20:51 PM (IST) 18 ఓవర్ల తర్వాత ఇంగ్లాండ్ – 149/5 శార్దూల్ డెత్ మంచి పొదుపైన ఓవర్ వేశాడు. అతడి ఓవర్ లో కేవలం 7 పరుగులు మాత్రమే వచ్చి పెద్ద వికెట్ పొందాడు. వరుసగా 3 ఓవర్లలో భారత్‌ పరుగుల చేయకుండా ప్రత్యర్థి బ్యాట్స్‌మెన్‌ను కట్టడి చేసింది. 14 MAR 2021 20:49 PM (IST) మోర్గాన్ అవుట్ 18 వ ఓవర్ తొలి బంతికి ఇంగ్లండ్‌కు షార్దుల్ ఠాకూర్ పెద్ద షాక్ ఇచ్చాడు. అతడి బౌలింగ్‌లో కెప్టెన్ మోర్గాన్ వికెట్ కీపర్ పంత్‌కు ఈజీ క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు. మోర్గాన్ 20 బంతుల్లో 28 పరుగులు చేశాడు. 14 MAR 2021 20:48 PM (IST) హార్దిక్ ఎకనామిక్ ఓవర్ భువనేశ్వర్ తరువాత, హార్దిక్ కూడా చాలా పొదుపుగా బౌలింగ్ వేశాడు. బెన్ స్టోక్స్, మోర్గాన్ వంటి పెద్ద హిట్టర్లు అతడి ఓవర్లో ఒక్క బౌండరీని కూడా పొందలేకపోయారు. 17 వ ఓవర్ నుంచి 6 పరుగులు మాత్రమే వచ్చాయి. 14 MAR 2021 20:47 PM (IST) భువనేశ్వర్ ఎకనామిక్ ఓవర్, ఇంగ్లాండ్ – 136/4 మళ్లీ బౌలింగ్‌కు వచ్చిన భువనేశ్వర్ మంచి ఓవర్ వేశాడు. 16 వ ఓవర్లో బౌలింగ్ కోసం వచ్చిన భువికి ఈ ఓవర్లో ఒక్క పెద్ద షాట్ కూడా ఆడే అవకాశం ఇవ్వలేదు. కేవలం 7 పరుగులు మాత్రమే ఇచ్చాడు. 14 MAR 2021 20:40 PM (IST) సుందర్‌కు రెండో వికెట్, బెయిర్‌స్టో అవుట్ వాషింగ్టన్ సుందర్ ఇండియాకు మరో బ్రేక్ త్రూ అందించాడు. ఈసారి భారత్‌కు జానీ బెయిర్‌స్టో వికెట్ లభించింది. అయితే, ఈ వికెట్ అంత ఈజీగా లభించలేదు. బెయిర్‌స్టో ఆడిన బంతి గాల్లోకి లేచింది. సూర్యకుమార్ యాదవ్ క్యాచ్ కోసం పరిగెత్తుకుంటూ వచ్చాడు. మొదటి మలుపులో బంతి అతని చేతిలో నుండి వచ్చింది, కాని అతను దానిని రెండవ ప్రయత్నంలో పట్టుకున్నాడు. బెయిర్‌స్టో 20 పరుగులు చేశాడు. 14 MAR 2021 20:39 PM (IST) ఇంగ్లాండ్ – 111/3 షార్దుల్ ఓవర్లో ఇంగ్లాండ్ 3 బౌండరీలు సాధించింది. ఈ రెండు బౌండరీలు కెప్టెన్ మోర్గాన్ బాదాడు. ఈ ఓవర్ నుండి 14 పరుగులు, ఇంగ్లాండ్ 100 పరుగులు పూర్తి చేసింది. 14 MAR 2021 20:18 PM (IST) జాసన్ రాయ్ అవుట్ భారత్‌ మంచి వికెట్‌ చివరకు దొరికింది. మరోసారి, వాషింగ్టన్ సుందర్ తన ఓవర్ మొదటి బంతికే జాసన్ రాయ్ వికెట్ తీసుకున్నాడు. ఈసారి కూడా రాయ్ అర్ధ సెంచరీకి దగ్గరగా వచ్చిన తరువాత పెవిలియన్ చేరాడు. రాయ్ మిడ్ వికెట్ వద్ద ఈ బంతిని బలంగా ఆడాడు, కాని బంతి బౌండరీని దాటలేకపోయింది. భువనేశ్వర్ అక్కడ మంచి క్యాచ్ తీసుకున్నాడు. రాయ్ 46 పరుగులు చేశాడు. చివరి మ్యాచ్‌లో కూడా సుందర్ తన ఓవర్ తొలి బంతికే రాయ్‌ను అవుట్ చేశాడు. ఆ ఇన్నింగ్స్‌లో రాయ్ 49 పరుగులు చేశాడు. 14 MAR 2021 20:16 PM (IST) ఇంగ్లాండ్ – 91/2 చివరి బంతికి బౌండరీ రావడంతో చాహల్ మరో మంచి ఓవర్ మిస్సయ్యింది. బెయిర్‌స్టో 11 వ ఓవర్ చివరి బంతిని లాంగ్ ఆన్‌లో ఒక ఫోర్‌గా మలిచాడు. ఈ ఓవర్ నుండి 8 పరుగులు వచ్చాయి. 14 MAR 2021 20:15 PM (IST) చాహల్ బొటనవేలు గాయం భారత జట్టులో కొంత ఆందోళన నెలకుంది. యుజ్వేంద్ర చాహల్ బొటనవేలుకి బంతి బలంగా తగిలింది. రాయ్ చాహల్ బంతిని బౌలర్ వైపు తీవ్రంగా ఆడాడు. క్యాచ్ తీసుకునే ప్రయత్నంలో, చాహల్ బొటనవేలుకి బంతి తగిలింది. 14 MAR 2021 20:14 PM (IST) 10 ఓవర్లు ముగిసేసరికి ఇంగ్లాండ్ బలమైన స్థితిలో ఉంది ఇంగ్లండ్ జట్టు 10 ఓవర్ల తర్వాత మెరుగైన స్థితిలో ఉంది. జట్టు కేవలం 2 వికెట్లు మాత్రమే కోల్పోయి 83 పరుగులు చేసింది. హార్దిక్ ఓవర్‌లో ఇంగ్లండ్‌కు బౌండరీ రాలేదు కానీ 9 పరుగులు లభించాయి 14 MAR 2021 20:13 PM (IST) చాహల్ పెద్ద అద్బుత బౌలింగ్, మలన్ అవుట్ యుజ్వేంద్ర చాహల్ తన రెండవ ఓవర్లో ఇండియా మంచి కమ్ బ్యాక్ అందించాడు. చాహల్ వేసిన రెండవ బంతిని భారీ షాట్ ఆడేందుకు ప్రయత్నించాడు. కాని అది మిస్ అయి బంతి ప్యాడ్‌ను తాకింది. భారత్ అప్పీల్‌ను అంపైర్ తిరస్కరించారు. దీంతో విరాట్ కోహ్లీ భారతదేశానికి DRS ను తీసుకున్నాడు. బంతి వికెట్ లైన్‌లో ఉంది. దీంతో ఇంగ్లాండ్ వికెట్ కోల్పోయింది 14 MAR 2021 20:11 PM (IST) ఎనిమిదో ఓవర్లో 13 పరుగులు, ఇంగ్లాండ్ – 64/1 జాసన్ రాయ్ హార్దిక్ పాండ్యా వేసిన బంతిని స్టైయిట్‌గా ఆడాడు. హర్దిక్ తన తలని వంచి, ఒక చేత్తో క్యాచ్ కోసం ట్రై చేశాడు. కాని అది మిస్సవ్వడంతో బౌండరికి వెళ్లి నాలుగు పరుగులు లభించాయి. అంతకుముందు, ఓవర్ మొదటి బంతికి శార్దుల్ ఫీల్డింగ్ సరిగా లేనందున, మలన్ ఒక ఫోర్ బాదాడు. 14 MAR 2021 19:43 PM (IST) 8 ఓవర్ల తర్వాత స్కోరు- 51/1 చాహల్ కట్టుదిట్టంగా బౌలింగ్ వేసి రాయ్‌ను ఇబ్బందిపెట్టాడు. అయితే, ఐదవ బంతి సిక్సర్‌గా మలిచి ఎదురుదాడికి ప్రయత్నించాడు. ఈ ఓవర్ నుంచి కేవలం 7 పరుగులు మాత్రమే వచ్చాయి. అలాగే, ఇంగ్లాండ్ 50 పరుగులు కూడా పూర్తయ్యాయి. 14 MAR 2021 19:41 PM (IST) చాహల్ తెలివైన బౌలింగ్ వికెట్ల కోసం కోహ్లీ తన కీ స్పిన్నర్ యుజ్వేంద్ర చాహల్‌ను రంగంలోకి దించాడు. చాహల్ మొదటి 3 బంతుల్లో రాయ్‌ను ఇబ్బంది పెట్టాడు. ఒకసారి అతను స్టంపింగ్‌పై రివ్యూ కోసం థర్డ్ అంపైర్‌ను అప్రోచ్ అయ్యాడు. 14 MAR 2021 19:38 PM (IST) బంతి అందకున్న పాండ్యా ఐదవ ఓవర్ ముగిసిన అనంతరం హార్దిక్ పాండ్యా బంతి అందుకున్నాడు. మంచి లైన్ అండ్ లెంగ్త్‌తో బౌలింగ్ వేస్తున్నాడు. మలన్, రాయ్ పాండ్యా బంతులు ఎదుర్కోలేక ఇబ్బందిపడుతున్నారు. 14 MAR 2021 19:35 PM (IST) ఐదవ ఓవర్‌లో 7 పరుగులు, ఇంగ్లాండ్ – 35/1 శార్దూల్ ఠాకూర్ అద్బుతమైన బౌలింగ్‌తో ఆకట్టుకుంటున్నాడు. తొలి ఓవర్‌లోనే వరుసగా రెండు బంతుల్లో డేవిడ్ మలన్ వికెట్లు తీయడానికి ప్రయత్నించాడు. రెండు బ్యాక్ టూ బ్యాక్ క్యాచ్‌లు మిస్సయ్యాయి. 14 MAR 2021 19:33 PM (IST) నాల్గవ ఓవర్‌లో 7 పరుగులు… ఇంగ్లాండ్ – 30/1 సుందర్ మరో మంచి ఓవర్‌తో ఇంగ్లాండ్ ఆటగాళ్లను కట్టడి చేశాడు. ఓవర్ మొదటి 5 బంతుల్లో కేవలం 3 పరుగులు మాత్రమే వచ్చాయి, కాని మలన్ చివరి బంతిని నేరుగా బౌండరీ వైపు ఆడి 4 పరుగులు సాధించాడు. 14 MAR 2021 19:32 PM (IST) దూకుడుగా ఆడే ప్రయత్నం చేస్తున్న రాయ్, ఇంగ్లాండ్ – 23/1 జాసన్ రాయ్ దూకుడు ఆడే ప్రయత్నం చేస్తున్నాడు. భువి వేసిన మూడవ ఓవర్ మూడవ బంతికి వెళ్ళిన రాయ్ భారీ షాట్ ఆడే ప్రయత్నం చేశాడు. బంతి పూర్తిగా కనెక్ట్ అవ్వలేదు. నాలుగు పరుగులు లభించాయి. 14 MAR 2021 19:30 PM (IST) రెండవ ఓవర్‌లో 7 పరుగులు, ఇంగ్లాండ్ – 12/1 మొదటి బంతికి జాసన్ రాయ్ సిక్సర్ బాదిన అనంతరం, సుందర్ బాగా తిరిగి ట్రాక్‌లోకి వచ్చి కట్టుదిట్టంగా బౌలింగ్ చేశాడు. తరువాతి 5 బంతుల్లో 1 పరుగు మాత్రమే ఇచ్చాడు. 14 MAR 2021 19:28 PM (IST) రెండో ఓవర్ సిక్సర్‌తో ప్రారంభించిన జాసన్ రాయ్ రెండో ఓవర్ సిక్సర్‌తో మాత్రమే ప్రారంభమైంది. వాషింగ్టన్ సుందర్ బౌలింగ్ వేశాడు. జాసన్ రాయ్ ఈ బంతిని మిడ్ వికెట్ బౌండరీకి ​​పంపి 6 పరుగులు సాధించాడు. చివరి మ్యాచ్‌లో, సుందర్ తన మొదటి బంతికే రాయ్‌ను ఎల్‌బిడబ్ల్యూగా పెవిలియన్ చేర్చాడు 14 MAR 2021 19:26 PM (IST) క్రీజ్‌లోకి మలన్..తొలి ఓవర్ చివరి బంతికి ఫోర్ తొలి వికెట్ పడటంతో ప్రపంచ నంబర్ వన్ టీ 20 బ్యాట్స్‌మన్ డేవిడ్ మలన్ క్రీజులోకి వచ్చాడు. మలన్ ఓవర్ చివరి బంతికి అందమైన కవర్ డ్రైవ్ చేసి ఒక ఫోర్ తీసుకున్నాడు. 14 MAR 2021 19:24 PM (IST) బట్లర్ అవుట్ భారత్‌కు తొలి ఓవర్‌లోనే బ్రేక్ త్రూ లభించింది. భువనేశ్వర్ తొలి ఓవర్ నాలుగవ బంతికి ఇంగ్లాండ్ బ్యాట్స్‌మన్ జాస్ బట్లర్‌ను వికెట్ల ముందు దొరకబుచ్చుకున్నాడు. బట్లర్ రివ్యూను వినియోగించుకోకుండా పెవిలియన్ వైపు మళ్లాడు 14 MAR 2021 19:22 PM (IST) ఫస్ట్ ఓవర్ భువనేశ్వర్ బౌలింగ్ గత మ్యాచ్‌లో భారత్‌ బౌలర్లపై వీరుచుకుపడ్డ జాసన్ రాయ్-జాస్ బట్లర్ జోడి క్రీజ్‌లోకి వచ్చింది. భారత్ తరఫున భువనేశ్వర్ మరోసారి బౌలింగ్ ప్రారంభించాడు TAGS India vs England india vs england 2nd t20 live score india vs england 2nd t20 live score updates India vs England 2nd T20 Live Updates India vs England 2nd T20I Live Cricket WEB STORIESమరిన్ని > ఈ యాప్స్‌తో ఆర్థికంగా నష్టపోయే ప్రమాదం ఈ యాప్స్‌తో ఆర్థికంగా నష్టపోయే ప్రమాదం కారులో ఇంజన్‌లో మంటలు చెలరేగాయి.. ఈ సమయంలో కార్ నడుపుతున్న వ్యక్తి బీర్‌తో కారులో ఇంజన్‌లో