ఇంగ్లండ్తో టీమిండియా టీ 20 ఫైట్‌ ప్రారంభం.

 


క్రికెట్‌ అభిమానులను పొట్టి క్రికెట్‌ అలరించనుంది. శుక్రవారం సాయంత్రం ఇంగ్లండ్తో టీమిండియా టీ 20 ఫైట్‌ ప్రారంభం కానుంది. తొలి మ్యాచ్‌ అహ్మదాబాద్‌లోని మోడీ స్టేడియంలో జరగనుంది. ఇప్పటికే ఇరు జట్లు ముమ్మరంగా ప్రాక్టీస్‌ చేశాయి. కాగా, హార్దిక్‌ పాండ్య, కీలక ఆటగాడు కేఎల్‌ రాహుల్‌ జట్టులో చేరడంతో భారత శిబిరం సందడిగా మారింది. ఇక తుది జట్టులో ఎవరెవరికి చోటు కల్పిస్తారనే విషయం ఆసక్తిగా మారింది. రోహిత్ శర్మ, శిఖర్ ధావన్, విరాట్‌ కోహ్లీతో పాటు శ్రేయాస్‌ అయ్యర్, రిషబ్ పంత్, కేఎల్ రాహుల్, హార్ధిక్ పాండ్యాలకు తుది జట్టులో స్థానం దక్కే అవకాశం ఉంది. అలాగే, ఇటీవల కాలంలో అద్భుతంగా రాణిస్తున్న అక్షర్ పటేల్, వాషింగ్టన్ సుందర్, భువనేశ్వర్ కుమార్, శార్ధూల్‌ ఠాకుర్, యజువేంద్ర చాహల్ కూడా ప్లేయింగ్‌ లెవెన్‌లో చోటు దక్కించుకుంటారని క్రీడా విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.