ఐసీసీ వరల్డ్ కప్ 2021 సూపర్ లిగ్ షెడ్యుల్ విడుదల.

 


స్పోర్ట్స్ : క్రికెట్ అంటే ప్రతి ఒక్కరికీ తెలిసిన ఆట. క్రికెట్ ఒక సీరీస్ ప్రకారం జరుగుతూ ఉంటుంది . అందులో "వరల్డ్ కప్ ఒకటి". ఇది ప్రతి నాలుగేళ్లకు ఒకసారి నిర్వహించే వరల్డ్ కప్. అందులో అర్హత సాధించాలంటే టీమ్ ర్యాంకింగ్ ఆధారంగా నిర్ణయం జరుగుతుంది. ఐసీసీ వన్డే ర్యాంకింగ్ టాప్ 8 జట్లను వన్డే వరల్డ్ కప్ ఆడటానికి అనుమతించేవాళ్ళు. దాంతోపాటు మరో నాలుగు జట్లను క్వాలిఫైయింగ్ మ్యాచ్ ల ద్వారా తీసుకునే వాళ్ళు. కాగా ఇండియా లో 2023 లో జరిగే వన్డే వరల్డ్ కప్ కోసం మాత్రం భారత జట్టు అర్హత సాధించాల్సి ఉన్నది. ఇండియాలో జరగనున్న వరల్డ్ కప్ లో కనీసం 13 జట్లు ఆడే అవకాశం ఉన్నది. ప్రస్తుతం వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్ చేరడానికి ఎలాగైతే ద్వైపాక్షిక సిరీస్ ను ఉపయోగించుకుంటున్నారో.. వన్డే సూపర్ లీగ్ పాయింట్ ల కోసం వాడుకొనున్నట్లు ఐసీసీ ఇప్పటికే స్పష్టం చేసింది. ఈ సూపర్ లీగ్ ద్వారా 8 జట్ల ను వన్డే వరల్డ్ కప్ కోసం ఎంపిక చేస్తారు. అర్హత ఇలా : వరల్డ్ కప్ సూపర్ లీగ్ మ్యాచ్ లు గతేడాది ఇండియా-ఆస్ట్రేలియా వన్డే సిరీస్ నుంచి ప్రారంభమైంది. ఆ సిరీస్ ను టీమిండియా 1-2 తేడాతో ఓడిపోయింది. ఈ ఐ సీ సీ సూపర్ లీగ్ మ్యాచ్ ఆధారంగా మ్యాచ్ గెలిస్తే 10 పాయింట్లు, టై అయితే చెరో 5 పాయింట్లు,ఓడిపోతే 0 పాయింట్ లభిస్తాయి. 2023 లో ఇండియా వరల్డ్ కప్ ఆదిపత్యం ఇస్తుండడంతో ఇప్పటికే అర్హత సాధించింది. ఇక మిగిలిన 7 జట్లను నిర్ణయిస్తారు సూపర్ లీగ్ ద్వారా. ఇక అర్హత సాధించని జట్లు తప్పకుండా వరల్డ్ కప్ క్వాలిఫైయింగ్ కు ఆడాల్సి ఉంటుంది. ఈ క్వాలిఫైయర్ నుంచి 5 జట్లను వరల్డ్ కప్ కోసం ఎంపిక చేస్తారు. ఐసీసీ విడుదల చేసిన వరల్డ్ కప్ షెడ్యూల్ ఇవే.. మ్యాచ్ లో ఆడబోయే జట్లు ఇవే... 1.వెస్టిండీస్ vs శ్రీలంక మార్చి 10 -తొలి వన్డే -నార్త్ సౌండ్ మార్చి 12- రెండో వన్డే -నార్త్ సౌండ్ మార్చి 14 -మూడో వన్డే -నార్త్ సౌండ్ 2.న్యూజిలాండ్ vs బంగ్లాదేశ్ మార్చి20- తొలి వన్డే -డునేదిన్ మార్చి 23 -రెండో వన్డే- క్రైస్ట్చర్చ్ మార్చి 26 -మూడో వన్డే -వెల్లింగ్టన్ 3.ఇండియా vs ఇంగ్లాండ్ మార్చి 23 -తొలి వన్డే -పూణే మార్చ్ 26 -రెండో వన్డే -పూణే మార్చ్ 28 -మూడో వన్డే -పూణే 4. సౌత్ ఆఫ్రికా vs పాకిస్తాన్ ఏప్రిల్ 29 - తొలి వన్డే - సెంచూరియన్ ఏప్రిల్ 4 - రెండో వన్డే - జోహెన్నెస్బర్గ్ ఏప్రిల్ 7 -మూడో వన్డే - సెంచూరియన్ 5.ఇంగ్లాండ్ vs పాకిస్తాన్ జులై 8 -తొలి వన్డే -కార్డిఫ్ జులై 10- రెండో వన్డే -లండన్ జులై 13 -మూడో వన్డే -బర్మింగ్హామ్ 6.ఐర్లాండ్ vs సౌత్ ఆఫ్రికా జులై 11 -తొలి వన్డే -డబ్లిన్ జులై 13- రెండో వన్డే-డబ్లిన్ జులై 16-మూడో వన్డే-డబ్లింగ్ 7. ఐర్లాండ్ vs జింబాబ్వే ఆగస్టు 6 - తొలి వన్డే- బెల్ ఫాస్ట్ ఆగస్టు 8- రెండో వన్డే -బెల్ ఫాస్ట్ ఆగస్టు 11 -మూడో వన్డే -బెల్ ఫాస్ట్