ప్రీ క్లైమాక్స్ షూటింగ్ లో ఎఫ్ 3 సినిమా..

 


టాలెంటెడ్ డైరెక్టర్ అనిల్ రావిపూడి దర్శకత్వంలో హీరో వెంకటేష్, వరుణ్ తేజ్ లతో కలిసి ప్రస్తుతం చేస్తోన్న సినిమా 'ఎఫ్ 3'. అయితే ఈ సినిమాలో సునీల్ కి చాల కాలం తరువాత మంచి క్యారెక్టర్ దొరికిందట. ఓ గెస్ట్ రోల్ ఉందని ప్రీక్లైమాక్స్ లో వచ్చే ఆ పాత్ర పూర్తీ కన్ ఫ్యూజన్ తో సాగుతూ ఫుల్ గా నవ్విస్తోందట. ప్రస్తుతం ఈ సీన్స్ నే షూట్ చేస్తున్నారట. కాగా ఇద్దరి హీరోలను ఫుల్ గా ఇరకాటంలో పెట్టే ఆ పాత్రలో సునీల్ చాలా బాగా నటిస్తున్నాడట. ఇక ఇప్పటికే ఎఫ్ 3 కాన్సెప్ట్ పోస్టర్ విడుదల చేసిన సంగతి తెలిసిందే, డబ్బులతో నింపిన ట్రాలీలను నెట్టు కెళుతున్న వెంకటేష్, వరుణ్ లుక్ ఆసక్తి రేపగా… ఇది డబ్బులు చుట్టూ నడిచే కామెడీ డ్రామా అని తెలియజేశారు. అనిల్ రావిపూడి ఈ సినిమా స్క్రిప్ట్ లో కొంత ఎమోషన్ అండ్ మెసేజ్ కూడా యాడ్ చేశాడట.