ఒకేసారి మూడు 5g ఫోన్లను లాంచ్ చేసిన ఒప్పో.

 


ప్రముఖ మొబైల్‌ తయారీ కంపెనీ ఒప్పో తన ఫ్లాగ్‌షిప్‌ స్మార్ట్‌ఫోన్‌ ఒప్పో ఫైండ్‌ X3 సిరీస్‌లో మూడు ఫోన్లను ఆవిష్కరించింది. ఫైండ్‌ X3 ప్రొ, ఫైండ్‌ X3 నియో, ఫైండ్‌ X3 లైట్‌ మోడళ్లను యూట్యూబ్‌ లైవ్‌స్ట్రీమ్‌ ఈవెంట్‌ ద్వారా ప్రపంచవ్యాప్తంగా విడుదల చేసింది. వీటితో పాటు ఒప్పో ఎన్కో X వైర్‌లెస్‌ ఇయర్‌బడ్స్‌ను లాంచ్‌ చేసింది. కొత్త ఫైండ్‌ X3 సిరీస్‌ ఫోన్లన్నీ 5జీ కనెక్టివిటీ, హోల్‌పంచ్‌ డిస్‌ప్లే, అత్యాధునిక డిజైన్‌తో వస్తున్నాయి. భారత్‌తో పాటు ఇతర దేశాల్లో ఎప్పుడు రిలీజ్‌ చేస్తామనేదానిపై కంపెనీ ఎలాంటి ప్రకటన చేయలేదు.