ఏపీ మున్సిపల్ ఎన్నికల్లో 60 శాతం పైగా పోలింగ్ నమోదు.

 


ఆంధ్రప్రదేశ్‌లో మున్సిపల్‌ ఎన్నికల పోలింగ్‌ ప్రశాంతంగా ముగిసింది. అక్కడక్కడా స్వల్ప ఘటనలు మినహా పోలింగ్ ప్రక్రియ‌ సజావుగా సాగింది. ఉదయం 7గంటల నుంచి పోలింగ్‌ ప్రారంభం కాగా.. ఓటర్లు పెద్ద సంఖ్యలో పోలింగ్‌ కేంద్రాల వద్దకు చేరుకొని ఓటు హక్కు వినియోగించుకున్నారు. మధ్యాహ్నం 3గంటల వరకు రాష్ట్ర వ్యాప్తంగా 53.57శాతం పోలింగ్‌ నమోదైనట్టు అధికారులు వెల్లడించారు. ఆంధ్రప్రదేశ్‌లో మున్సిపల్‌ ఎన్నికల పోలింగ్‌ ప్రశాంతంగా ముగిసింది. అక్కడక్కడా స్వల్ప ఘటనలు మినహా పోలింగ్ ప్రక్రియ‌ ప్రశాంతంగా జరిగింది. ఉదయం 7గంటల నుంచి పోలింగ్‌ ప్రారంభం కాగా.. ఓటర్లు పెద్ద సంఖ్యలో పోలింగ్‌ కేంద్రాల వద్దకు చేరుకొని ఓటు హక్కు వినియోగించుకున్నారు. మధ్యాహ్నం 3గంటల వరకు రాష్ట్ర వ్యాప్తంగా 53.57శాతం పోలింగ్‌ నమోదైనట్టు అధికారులు వెల్లడించారు. బ్యాలెట్‌ బ్యాక్సులో ఓటరు తీర్పు పడింది. ఈ నెల14న కౌంటింగ్.. పంచాయతీ ఎన్నకల తర్వాత జరిగిన ఈ ఎన్నికలు ఎలాంటి తీర్పు వస్తుందని ఉత్కంఠ నెలకొంది. పార్టీ గుర్తులపై జరిగిన ఈ ఎన్నికల్లో అధికార పార్టీ సంక్షేమ పాలనకు పట్టం కట్టారా? లేక ప్రతిపక్షాలకు చాన్స్‌ ఇస్తారా? అనేది మార్చి14న తేలనుంది. గెలుపు గుర్రాలెవరో శనివారం తేలిపోనున్నది. ఎవరు గెలుస్తారో..? ఎవరు ఓడతారో..? తెలుసుకునేందుకు అంతా ఆసక్తి చూపిస్తున్నారు. మరోవైపు ఇదే అంశంపై బెట్టింగ్ రాయుళ్లు సైతం బరిలో దిగినట్లు సమాచారం. రూ.వేల నుంచి లక్షల వరకు పందేలు కాస్తున్నారని తెలుస్తున్నది. ఇలాంటి వార్డుల్లో బెట్టింగ్ జోరుగా సాగుతోందని సమాచారం. ఎవరు గెలుస్తారనే అంశంపై మరో మూడు రోజుల పాటు ఉత్కంఠ నెలకొననున్నది. అభ్యర్థుల భవితవ్యం మాత్రం స్ట్రాంగ్ రూముల్లో భద్రంగా ఉంది. రాష్ట్ర వ్యాప్తంగా 12 కార్పొరేషన్లు, 71 పురపాలికల్లో పోలింగ్‌ జరిగింది. ఈ మధ్యాహ్నం 3గంటల వరకు 53.57శాతం పోలింగ్‌ నమోదైనట్టు అధికారులు ప్రకటించారు. జిల్లాల వారీగా నమోదైన పోలింగ్‌ వివరాలు ఇలా ఉన్నాయి.. శ్రీకాకుళం జిల్లాలో 59.93 శాతం విజయనగరం 56.63శాతం విశాఖ 47.86శాతం తూర్పుగోదావరి 66.21శాతం పశ్చిమగోదావరి 53.68శాతం కృష్ణా 52.87శాతం గుంటూరు 54.42శాతం ప్రకాశం 64.31శాతం నెల్లూరు 61.03శాతం అనంతపురం 56.90శాతం కర్నూలు 48.87శాతం కడప 56.63శాతం చిత్తూరు 54.12శాతం మధ్యాహ్నం 1 గంట వరకు రాష్ట్రవ్యాప్తంగా.. 42.84 శాతం పోలింగ్ నమోదైంది. శ్రీకాకుళం 44.38 శాతం విజయనగరం 45.10 శాతం విశాఖ 36.75 శాతం తూర్పు గోదావరి జిల్లా 53.08 శాతం పశ్చమ గోదావరి జిల్లా 45.51 శాతం కృష్ణా 41.49 శాతం గుంటూరు 44.69 శాతం ప్రకాశం 53.19 శాతం నెల్లూరు 48.89 శాతం చిత్తూరు 41.28 శాతం అనంతపురం 45.42 శాతం కడప 46.02 శాతం కర్నూలు 40.99 శాతం రాష్ట్రవ్యాప్తంగా 42.84 శాతం అయితే, ఇప్పటికే నాలుగు మున్సిపాలిటీలు ఏకగ్రీవం కాగా, ఏలూరు కార్పొరేషన్‌ ఎన్నికలకు హైకోర్ట్‌ గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చింది. అయితే ఫలితాలు వెల్లడించవద్దని ఉత్తర్వులు ఇచ్చింది. కట్టుదిట్టమైన ఏర్పాట్ల నడుమ 71 మున్సిపాలిటీలకు ఎన్నికలు జరుగుతున్నాయి. మొత్తం 2,123 వార్డుల్లో 490 వార్డులు ఏకగ్రీవమయ్యాయి. మిగతా 1,633 వార్డులకు ఎన్నికలు జరుగుతున్నాయి. ఇందుకోసం రాష్ట్రవ్యాప్తంగా 4,981 మంది అభ్యర్థులు పోటీ పడుతున్నారు. 12 కార్పొరేషన్‌లలోని 671 డివిజన్లలో 89 ఏకగ్రీవం కాగా, 582 డివిజన్లకు ఎన్నికలు జరుగుతున్నాయి. కార్పొరేషన్లలో 2,364 మంది అభ్యర్థులు పోటీ పడుతున్నారు. మొత్తం ఓటర్ల సంఖ్య 76 లక్షల, 23 వేల 43 మంది. ఇందులో పురుష ఓటర్లు 37 లక్షల 52 వేల 668 మంది కాగా, మహిళా ఓటర్ల సంఖ్య 38 లక్షల 69 వేల 225 మంది. ఇతరులు 1,150 మంది. మున్సిపల్‌ ఎన్నికల 7,699 పోలింగ్‌ స్టేషన్లను ఏర్పాటు చేశారు. కార్పొరేషన్‌ ఎన్నికల కోసం 4,410 పోలింగ్‌ స్టేషన్లు, మున్సిపాలిటీ ఎన్నికల కోసం 3,289 పోలింగ్‌ స్టేషన్లను ఏర్పాటు చేసినట్లు రాష్ట్ర ఎన్నికల సంఘం అధికారులు తెలిపారు. కార్పొరేషన్‌ ఎన్నికల కోసం 25,682 మంది పోలింగ్‌ సిబ్బందిని నియమించారు. ఇందులో పీవోలు 4,423 మంది..4,423 మంది అసిస్టెంట్‌ పీవోలున్నారు. ఇతర పోలింగ్ అధికారులు 15,166 మంది. ఇందులో రూట్‌ అధికారులు 121 మంది, జోనల్‌ అధికారులు 451 మంది, మైక్రో అబ్జర్వర్స్‌ 1,098 మంది ఉన్నారు. ఇటు, మున్సిపాలిటీ ఎన్నికల విధులకు హాజరవుతున్న సిబ్బంది సంఖ్య 21,888. ఇందులో 3277 మంది పీవోలు, 3277 మంది అసిస్టెంట్‌ పీవోలున్నారు. ఇతర అధికారులు 13002 మంది ఉన్నారు