నాగార్జున సాగర్ ఉప ఎన్నికకు 8 నామినేషన్ లు ధాఖలైయాయి.

 


ఇప్పటి వరకు నాగార్జున సాగర్ ఉప ఎన్నికకు 8 నామినేషన్స్ దాఖలయ్యాయని ఆర్వో రోహిత్ సింగ్ తెలిపారు. గురువారం ఏబీఎన్‌తో ఆయన మాట్లాడుతూ... 27,28,29 వరుస సెలవులు, నామినేషన్స్ తీసుకోబడవని వెల్లడించారు. నాగార్జున సాగర్ ఉప ఎన్నికకు 346 పోలింగ్ కేంద్రాలు కేటాయించినట్లు చెప్పారు. కరోనా నేపథ్యంలో 1000 మందికి ఒక పోలింగ్ కేంద్ర, గతంలో కంటే 53 పోలింగ్ కేంద్రాలు పెంచినట్లు వివరించారు. ఉదయం 7 నుంచి సాయంత్రం7 వరకు పోలింగ్ ఉంటుందన్నారు. ఈనెల 30వ తేదీతో నామినేషన్ల గడువు ముగుస్తుందని స్పష్టం చేశారు. ఏవైనా ఫిర్యాదులు ఉంటే టోల్ ఫ్రీ నెంబర్, సువిధ, విజిల్ యాప్ ద్వారా స్వీకరించి పరిష్కరిస్తామని ఆర్వో రోహిత్ సింగ్ పేర్కొన్నారు.