బాలీవుడ్ బిగ్ బీ. బచ్చన్ కు‌‌ మరోసారి సర్జరీ

 


అమితాబ్‌ బచ్చన్‌ మరోసారి సర్జరీ చేయించుకోబోతున్నారు. ఈ విషయాన్ని ఆయనే తన బ్లాగ్‌ ద్వారా తెలిపారు. కొద్ది రోజులు బ్లాగ్‌కు దూరంగా ఉంటున్నానని ప్రకటించారు. ఆయనకు సర్జరీ అనగానే అమితాబ్‌కు ఏమైంది? సర్జరీ ఎందుకు? అంటూ సోషల్‌ మీడియాలో చర్చ మొదలైంది. సర్జరీ విజయవంతం కావాలని, బిగ్‌బీ త్వరగా కోలుకొని సినిమాలు చేయాలని అభిమానులు ట్వీట్లు చేస్తున్నారు. అమితాబ్‌ తాజాగా నటించిన చిత్రాలలో 'ఝుండ్‌', 'చెహరే' చిత్రాలు విడుదలకు సిద్ధంగా ఉన్నాయి.