నాంపల్లి పబ్లిక్ గార్డెన్‌లో 'అజాదీ కా అమృత్ మహోత్సవ్' కార్యక్రమాన్ని ప్రారంభించనున్న సీఎం కేసీఆర్.‌

 


హైదరాబాద: శుక్రవారం నాంపల్లి పబ్లిక్ గార్డెన్‌లో 'అజాదీ కా అమృత్ మహోత్సవ్' కార్యక్రమాన్ని సీఎం కేసీఆర్‌ ప్రారంభించనున్నారు. రేపు ఉదయం11 గంటలకు జాతీయ పతాకాన్ని సీఎం ఆవిష్కరించనున్నారు. వరంగల్‌లో జరిగే ఉత్సవాల్లో గవర్నర్‌ తమిళిసై పాల్గొననున్నారు. రేపటి నుంచి ఆగస్ట్ 15, 2022 వరకు ఉత్సవాలు కొనసాగుతాయి. ఉత్సవాలకు తెలంగాణ ప్రభుత్వం రూ.25 కోట్లు కేటాయించింది. దేశానికి స్వాతంత్ర్యం వచ్చి 75 ఏళ్లు పూర్తివుతున్న సందర్భంగా అజాదీ కా అమృత్ మహోత్సవ్ పేరిట కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్తంగా జరుపనున్న ఉత్సవాలను రాష్ట్రంలో ఘనంగా నిర్వహించాలని కేసీఆర్ ఆదేశించిన విషయం తెలిసిందే. భారత స్వాతంత్ర్య ఉద్యమంలో తెలంగాణ పోషించిన పాత్ర ప్రత్యేకమైందని సీఎం గుర్తుచేశారు. ఉత్సవాల నిర్వహణ కమిటీ చైర్మన్‌గా ప్రభుత్వ సలహాదారు కేవీ రమణాచారిని నియమించారు.