జపాన్ లో భారీ భూకంపం సంభవించింది.

 


జపాన్‌లో భూకంపం సంభవించింది. జపాన్ సమయం ప్రకారం శనివారం (సాయంత్రం గం. 6:09) ప్రాంతంలో 7.2 తీవ్రతతో ఈ భూకంపం వచ్చింది. మియాగి ప్రాంతంలో ఏర్పడ్డ ఈ ఉత్పాతం ఫసిఫిక్‌ సముద్రంలో 60 కిలోమీటర్ల (37 మైళ్ళు) లోతుతో ఏర్పడినట్టు జపాన్ వాతావరణ శాఖ ప్రకటించింది. సునామీ వచ్చే ప్రమాదం కూడా ఉందని హెచ్చరించింది. అయితే, ప్రమాద తీవ్రత ఎంతన్నది ఇంకా తెలియరాలేదు.