ఆర్.ఆర్ ఆర్ సినిమా నుండి మరో అప్ డేట్. ఆలియా భట్ లుక్ విడుదల.

 


ఎన్టీఆర్‌, రామ్‌చరణ్‌ కథానాయకులుగా రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న భారీ బడ్జెట్‌ చిత్రం 'ఆర్ఆర్ఆర్‌'. ఈ చిత్రంలో సీతారామరాజు పాత్ర పోషిస్తున్న రామ్ చరణ్‌కు జోడీగా సీత పాత్రలో బాలీవుడ్ భామ అలియా భట్ నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో అలియా ఫస్ట్ లుక్ ను మార్చి 15న రిలీజ్ చేయనున్నట్టు చిత్ర నిర్మాణ సంస్థ డీవీవీ ఎంటర్‌టైన్‌మెంట్‌ ఓ ప్రకటనలో వెల్లడించింది. మార్చి 15న అలియా భట్ పుట్టినరోజు కావడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. "దివ్యతేజస్సుతో అలరారే మా సీత వస్తోంది. చూడండి" అంటూ డీవీవీ ఎంటర్‌టైన్‌మెంట్‌ ట్వీట్ చేసింది. మార్చి 15న ఉదయం 11 గంటలకు అలియా భట్ ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్ చేస్తున్నామని వెల్లడించింది. కీరవాణి స్వరాలు సమకూరుస్తున్న ఈ సినిమాను దసరా కానుకగా అక్టోబరు 13న ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. డీవీవీ ఎంటర్‌టైన్‌మెంట్‌ పతాకంపై డీవీవీ దానయ్య 'ఆర్ఆర్ఆర్‌' నిర్మిస్తున్నారు.