అరుణాచల్‌ ప్రదేశ్‌ సరిహద్దుల్లో బుల్లెట్‌ రైలు నడిపేందుకు చైనా కార్యాచరణ.

 


వచ్చే జులై నాటికి అరుణాచల్‌ ప్రదేశ్‌ సరిహద్దులకు సమీపంలో టిబెట్‌ వరకు బుల్లెట్‌ రైలు నడిపేందుకు చైనా కార్యాచరణ వేగవంతం చేసింది. చైనాలోని ల్లాసా నగరాన్ని, తూర్పు టిబెట్‌లోని నింగ్‌చి నగరాన్ని కలుపుతూ 435 కిలోమీటర్ల పొడవైన హైస్పీడ్‌ రైల్వే ట్రాక్‌ నిర్మాణం సాగుతోంది. 2014 నుంచి ఈ పనులు కొనసాగుతుండగా, వచ్చే జూన్‌ చివరి నాటికి ఆ మార్గంలో బుల్లెట్‌ రైలు దూపుపోతున్నట్లు చైనా రైల్వే అధికారులు పేర్కొన్నారు. టిబెట్‌లో విద్యుద్దీకరించిన మొట్టమొదటి రైల్వే లైన్‌ కూడా ఇదే కానుంది. 2020చివరి నాటికే ట్రాక్‌ పనులు పూర్తయ్యాయి. అయితే ఈ రైలు 160 కిలోమీటర్ల గరిష్ట వేగంతో పరుగులు పెట్టేలా రూపొందించారు. ప్రస్తుతం చైనాలో 37,900 కిలోమీటర్ల మేర హైస్పీడ్‌ రైళ్లు నడుస్తుండగా, 2025 నాటికి 50 వేల కిలోమీటర్లకు పెంచాలని లక్ష్యంగా పెట్టుకుంది. అయితే పనులు కూడా వేగవంతంగానే కొనసాగుతున్నట్లు చైనా రైల్వే అధికారులు పేర్కొంటున్నారు. ఈ బుల్లెట్‌ రైలు కోసం అత్యాధునిక టెక్నాలజీలో పనులు వేగవంతంగా కొనసాగుతున్నాయని అన్నారు. త్వరగా అందుబాటులోకి తెచ్చేందుకు పనులు జరుగుతున్నాయని అన్నారు. అలాగే అతి తక్కువ సమయంలో గమ్యానికి చేరేలా రూపొందిస్తున్నామని అన్నారు.ఈ ఏడాది జూన్‌ నాటికి రైలు మార్గం పూర్తయ్యేందుకు పనులు వేగవంతంగా కొనసాగుతున్నాయని అంటున్నారు.