ప్రపంచం ఆరోగ్య సంస్థ హెచ్చరిక...?

 


వినికిడి లోపం సమస్యపై పరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ తన తాజా నివేదికలో హెచ్చరిక జారీ చేసింది. ప్రపంచ జనాభాలో నలుగురిలో ఒకరు 2050 నాటికి వినికిడి సమస్యతో బాధపడతారని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ఓ) మంగళవారం హెచ్చరించింది. అంటువ్యాధులు, జనన లోపాలు, మారిన జీవనశైలితో పాటు వివిధ సమస్యల వల్ల పిల్లల్లో వినికిడి లోపాలు బహిర్గతం అయ్యే ప్రమాదముందని డబ్ల్యూహెచ్ఓ తన నివేదికలో వెల్లడించింది. వినికిడి లోపాల నివారణకు చికిత్స కోసం అదనపు పెట్టుబడులు పెట్టాలని వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ పిలుపునిచ్చింది. వినికిడి లోపం సమస్య వల్ల కమ్యూనికేషన్, విద్య, ఉపాధికి దూరమయ్యే ప్రమాదముందని నివేదికలో పేర్కొంది.ప్రస్థుతం ప్రపంచవ్యాప్తంగా ఐదుగురిలో ఒకరికి వినికిడి సమస్యలున్నాయని, 2050 నాటికి ఇది మరింత పెరిగి ప్రతీ నలుగురిలో ఒకరికి ఈ సమస్య ఏర్పడుతుందని ప్రపంచ ఆరోగ్యసంస్థ తన నివేదికలో పేర్కొంది. రాబోయే మూడు దశాబ్దాల్లో వినికిడి లోపం ఉన్న వారి సంఖ్య ఒకటిన్నర రెట్టు పెరగవచ్చిన నివేదిక వెల్లడించింది. 2050 నాటికి వినికిడి లోపం ఉన్నవారి సంఖ్య 1.5 బిలియన్ల నుచి 2.5 బిలియన్లకు పెరగవచ్చని డబ్ల్యూహెచ్ఓ వివరించింది.పేద దేశాల్లో వినికిడి సమస్యలతో బాధపడుతున్న వారు ఎక్కువగా ఉన్నా వారికి చికిత్స చేసే నిపుణుల సంఖ్య కూడా తక్కువగా ఉందని వెల్లడైంది.బహిరంగ ప్రదేశాల్లో శబ్దాన్ని తగ్గించడం, వినికిడి లోపం కలిగించే మెనింజైటిస్ వ్యాధులకు టీకాలు వేయించాలని ప్రపంచ ఆరోగ్యసంస్థ ప్రతిపాదించింది. పిల్లల్లో వినికిడి లోపాన్ని నివారించవచ్చని, దీనికోసం సమస్యను గుర్తించి పరిష్కరించాలని ప్రపంచ ఆరోగ్య సంస్థ డైరెక్టర్ జనరల్ టెడ్రోస్ అధనామ్ ఘెబ్రేయేసస్ తన నివేదికలో సూచించారు.