ఆచార్య సినిమా నుండి పోస్టర్ రిలీజ్.

 


మెగాస్టార్ చిరంజీవి, - మెగా పవర్ స్టార్ ఒకే ప్రైమ్ లో కనిపిస్తే.. చూడాలని మెగా ఫ్యాన్స్ ఎప్పటినుండో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఆ తరుణం త్వరలోనే రానుంది. అందుకు సంబంధించిన పోస్టర్ ను తాజాగా టీమ్ మేకర్స్ క్లారిటీ ఇచ్చారు. ఇక పోస్టర్ లో చరణ్ అటు వైపు తిరిగి ఉండగా, వెనుక నుండి మెగాస్టార్, చరణ్ భుజం పై చేయి వేస్తోన్న షాట్ ను ఫోటో తీసి రిలీజ్ చేశారు. కాగా సక్సెస్ ఫుల్ డైరెక్టర్ కొరటాల శివ కలయికలో రానున్న ఈ సినిమా కోసం ఓ పురాతన దేవాలయం సెట్ వేశారని.. ప్రస్తుతం ఆ సెట్ లోనే చరణ్ - చిరు కాంబినేషన్ లోని సిన్స్ ను షూట్ చేస్తున్నారని తెలుస్తోంది. నిజానికి ఈ సీన్స్ ను గత నెలలోనే షూట్ చేయాలి, కొన్ని కారణాల వల్ల షూటింగ్ పోస్ట్ ఫోన్ అయింది. ఇక ఈ 'ఆచార్య' రాష్ట్రంలోని దేవాలయాలు మరియు అనేక ఇతర మతపరమైన కార్యకలాపాలకు సంబంధించిన అన్యాయాలను అక్రమాలను అరికట్టే శక్తిగా రాబోతున్నాడట. మెగాస్టార్ నుండి ఇలాంటి సినిమా గతంలో ఎప్పుడూ రాలేదు. దాంతో ఈ నేపథ్యంలో సినిమా వస్తోంది అనేసరికి ఫ్యాన్స్ రెట్టింపు ఉత్సాహంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇక ఈ సినిమాలో మెగాస్టార్ ను ఎండోమెంట్స్ విభాగానికి చెందిన అధికారిగా కొరటాల చూపించబోతున్నాడు. పైగా ప్రస్తుతం మెగాస్టార్ ఈ చిత్రం కోసం బరువు తగ్గడంతో పాటు లుక్ కూడా చేంజ్ చేయడం ఆసక్తి రేపుతోంది. కాజల్ ఈ సినిమాలో ఒక జర్నలిస్ట్ గా నటిస్తోందని తెలుస్తోంది. అలాగే రామ్ చరణ్ మాజీ నక్సలైట్ గా కనిపించబోతున్నాడట. అలాగే ఈ చిత్రంలో రెజీనా ఓ స్పెషల్ సాంగ్ లో కనిపించనుంది.