తెలంగాణ ఎంసెట్ పరీక్షల షెడ్యూల్ విడుదల.

 


తెలంగాణ ఎంసెట్ పరీక్షల షెడ్యూల్ విడుదలైంది. దీనికి సంబంధించిన నోటిఫికేషన్‌ను రాష్ట్ర సాంకేతిక విద్యామండలి అధికారులు శనివారం నాడు విడుదల చేశారు. ఈ షెడ్యూల్ ప్రకారం.. జులై 5వ తేదీన అగ్రికల్చర్ అభ్యర్థులకు పరీక్ష నిర్వహించనున్నారు. జులై 6న మెడికల్ ఎంట్రెన్స్ టెస్ట్ నిర్వహిస్తారు. జులై 7వ తేదీ నుంచి 9వ తేదీ వరకు ఇంజినీరింగ్ కోర్సు అభ్యర్థులకు ప్రవేశ పరీక్ష పెడతారు. ఈ పరీక్షకు సంబంధించి అప్లికేషన్ల కోసం ఈనెల 18న నోటిఫికేషన్‌ను విడుదల చేయనున్నారు. ఇక ఫిబ్రవరి 20వ తేదీ నుంచి ఆన్‌లైన్‌లో దరఖాస్తులు స్వీకరించనున్నారు