అదిరిపోయిన అల్లూరి సీతారామరాజు ఫస్ట్ లుక్.

 
ఉపాసన కొణిదెల.. సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్‏గా ఉంటుందన్న సంగతి తెలిసిందే. రామ్ చరణ్ సతీమణిగానే కాకుండా.. అపోలో హాస్పిటల్స్ అధిపతి మనవరాలిగా ఎంతో మందికి అండగా నిలుస్తూ.. మంచి గుర్తింపు పొందింది. ఎప్పుడూ.. తన వ్యక్తిగత విషయాలతోపాటు.. రామ్ చరణ్ సినిమాలకు సంబంధించిన అప్ డేట్స్ ఇస్తూ ఉండే ఉపాసన.. ఇటీవల ఫిట్‏నెస్‏కు సంబంధించిన సూత్రాలను చెబుతూ.. సోషల్ మీడియా ద్వారా ప్రజలకు దగ్గరవుతున్నారు. ఇక రామ్ చరణ్ పుట్టిన రోజు సందర్భంగా ‘ఆర్ఆర్ఆర్’ సినిమా నుంచి రామరాజు పోస్టర్ విడుదలైన సంగతి తెలిసిందే. జక్కన్న రిలీజ్ చేసిన క్షణాల్లోనే ఈ పోస్టర్ సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతుంది. తాజాగా ఈ పోస్టర్ పై ఉపాసన కొణిదెల రియాక్ట్ అయ్యారు.

‘ఆర్ఆర్ఆ’ర్ సినిమాలోని రామ్ చరణ్ మోషన్ పోస్టర్‏ను షేర్ చేస్తూ.. “రామ్.. నువ్వు నాకు లార్డ్ రాముడిగా కనిపిస్తున్నావంటూ”.. ట్వీట్ చేసింది. శనివారం రామ్ చరణ్ పుట్టిన రోజు సందర్భంగా రాజమౌళీ  విడుదల చేసిన రామరాజు పోస్టర్‏ను చూసి అభిమానులు తెగ సంబరపడిపోతున్నారు. ఇదిలా ఉండగా.. రామ్ చరణ్ బర్త్ డే పురస్కరించుకొని.. అభిమానులు శుక్రవారం ఉదయమే చరణ్ నివాసానికి చేరుకున్నారు. వీరిని కలిసేందుకు చరణ్ కూడా ముందుకొచ్చాడు. తన ఇంటి ముందు ఉన్న గేట్ మీద నుంచి అభిమానులతో మాట్లాడాడు. ఈ క్రమంలోనే అభిమానుల కోరికమేరకు మీసం తిప్పాడు చరణ్. అనంతరం ఆర్ఆర్ఆర్ మూవీ గురించి ముచ్చటించాడు. ప్రస్తుతం ఆర్ఆర్ఆర్ సినిమాలో చరణ్ తోపాటు యంగ్ టైగర్ ఎన్టీఆర్ కూడా నటిస్తున్నాడు. వీరిద్ధరికి జోడీలుగా.. అలియా భ‌ట్‌, ఒలీవియా మోరిస్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఈ సినిమాను అక్టోబర్ 13న ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నాడు జక్కన్న. అలాగే మెగాస్టార్ చిరంజీవి.. కొరటాల శివ కాంబోలో తెరకెక్కుతున్న ఆచార్య సినిమాలో ఓ కీలక పాత్రలో నటిస్తున్నాడు చరణ్. ఇందులో కాజల్ అగర్వాల్ హీరోయిన్‏గా నటిస్తుండగా.. పూజాహెగ్డే కీలక పాత్రలో నటింస్తుంది. కొణిదెల ప్రొడక్షన్స్, మ్యాట్నీ ఎంటర్ టైన్మెంట్స్ బ్యానర్లపై మెగా పవర్ స్టార్ రాంచరణ్, నిరంజన్ రెడ్డి సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ మూవీని మే 13న దేశ వ్యాప్తంగా విడుదలకానుంది.

అల్లూరిగా... రామ్‌చరణ్్