సరికొత్త స్మార్ట్‌ఫోన్‌ను ఆవిష్కరించనున్న శాంసంగ్ కంపెనీ.‌

 


సౌత్‌కొరియా ఎలక్ట్రానిక్స్‌ కంపెనీ శాంసంగ్‌ త్వరలో మరో సరికొత్త స్మార్ట్‌ఫోన్‌ను ఆవిష్కరించనుంది. గెలాక్సీ ఎం సిరీస్‌లో M12 స్మార్ట్‌ఫోన్‌ను మార్చి 11న మధ్యాహ్నం 12 గంటలకు భారత్‌లో విడుదల చేయనున్నట్లు శాంసంగ్‌ అధికారికంగా ప్రకటించింది. శాంసంగ్‌ ఇప్పటికే ఎం సిరీస్‌లో గెలాక్సీ ఎం 51, గెలాక్సీ ఎం 31ఎస్‌, గెలాక్సీ ఎం 31 తదితర మోడళ్లను మార్కెట్లోకి తీసుకొచ్చింది. గెలాక్సీ M12 ఫోన్‌ 6,000 mAh బ్యాటరీ, 48ఎంపీ క్వాడ్‌ రియర్‌ కెమెరా సెటప్‌, 8 nm ఎక్సినోస్‌ 850 చిప్‌సెట్‌తో వస్తుందని శాంసంగ్‌ ధ్రువీకరించింది. స్మార్ట్‌ఫోన్‌ 90 Hz రిఫ్రెష్‌రేట్‌తో 6.5 అంగుళాల ఇన్ఫినిటీ వీ డిస్‌ప్లేను కలిగిఉంటుందని అమెజాన్‌ టీజర్‌ వెల్లడించింది. కొత్త ఫోన్‌ ధర రూ.12వేలలోపు ఉంటుందని తెలుస్తున్నది