తెలంగాణలో అంచనాలకు మించి అప్పులు...

 


2020-21 బడ్జెట్‌ అంచనాల్లో జనవరి నాటికి 67% చేరిన రాబడులు ఒక్క జనవరిలోనే ఖజానాకు రూ.14,600 కోట్ల ఆదాయం జీఎస్టీ ఆదాయంలో తగ్గుదల నమోదు రిజిస్ట్రేషన్లు, ఎక్సైజ్‌ రాబడులు రూ. 2 వేల కోట్లు కేంద్ర పన్నుల్లో వాటా ఈసారి రూ. 500 కోట్లే వడ్డీల కింద రూ.12 వేల కోట్లకుపైగా చెల్లింపులు సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్ర ఖజానాకు ఈ ఆర్థిక సంవత్సరంలో దాదాపు రూ.1.19 లక్షల కోట్లు సమకూరాయి. 2020-21 ఆర్థిక సంవత్సరానికిగాను జనవరి నాటికి 10 నెలలు పూర్తవగా మొత్తం వార్షిక బడ్జెట్‌ అంచనాలో 67 శాతం వచ్చినట్లు కంప్ట్రోలర్‌ అండ్‌ ఆడిటర్‌ జనరల్‌(కాగ్‌) నివేదిక వెల్లడించింది