రెండో వన్డేలో కొన్ని మార్పులతో సిద్దం కాబోతున్న టీమిండియా .

 


భారత్‌-ఇంగ్లండ్‌ మధ్య మూడు వన్డే సిరీస్‌ జరుగుతున్న విషయం తెలిసిందే. ఇందులో భాగంగా భారత్‌ మొదటి మ్యచ్‌లో గెలుపొందగా.. శుక్రవారం రెండో మ్యచ్‌ జరగనుంది. ఈ నేపథ్యంలో టీమిండియా ఇంగ్లాడ్‌తో జరగబోయే రెండో వన్డేలో కొన్ని మార్పులతో సిద్దం కాబోతుందని తెలుస్తుంది. శుక్రవారం నాటి రెండు మార్పులు చేసే అవకాశాలు ఉన్నాయి. ఇప్పటికే గాయం కారణంగా మిగతా వన్డేలకు శ్రేయస్ అయ్యర్ దూరం కావడంతో అతని స్థానంలో సూర్యకుమార్ యాదవ్‌ను తీసుకోవడం ఖాయంగా కనిపిస్తోంది. ఇప్పటికే టీ20 అరంగేట్రం చేసిన సూర్యకుమార్.. ఈ మ్యాచ్‌తో వన్డేల్లోనూ నేషనల్ టీమ్ తరఫున తొలి మ్యాచ్ ఆడనున్నాడు. ఇక తొలి వన్డేలో విఫలమైన స్పిన్నర్ కుల్‌దీప్ యాదవ్ స్థానంలో లెగ్‌స్పిన్నర్ యజువేంద్ర చాహల్‌కు చోటు దక్కే అవకాశం కనిపిస్తోంది. తొలి వన్డేలో ఘన విజయం సాధించి ఊపు మీదున్న కోహ్లి సేన.. శుక్రవారం జరిగే రెండో వన్డేలోనూ గెలిచి మూడు వన్డేల సిరీస్‌ను గెలవాలని భావిస్తోంది. రెండో వన్డేకు తుదిజట్టు (అంచనా): రోహిత్ శర్మ, శిఖర్ ధావన్‌, విరాట్ కోహ్లి, సూర్యకుమార్ యాదవ్‌, కేఎల్ రాహుల్, హార్దిక్ పాండ్యా, కృనాల్ పాండ్యా, యజువేంద్ర చాహల్‌, శార్దూల్ ఠాకూర్‌, ప్రసిద్ధ్ కృష్ణ, భువనేశ్వర్ కుమార్‌.