పనీర్ తురుము - రెండున్నర కప్పులుపనీర్్ , బ్రెడ్ పౌడర్ - అర కప్పు, జీడిపప్పు పేస్ట్ - పావు కప్పు, అల్లం-వెల్లుల్లి పేస్ట్ - పావు టీ స్పూన్, పచ్చిమిర్చి ముక్కలు - ఒకటిన్నర టీ స్పూన్లు, పెరుగు - 2 టేబుల్ స్పూన్లు, మిరియాల పొడి, జీలకర్ర పొడి - పావు టీ స్పూన్ చొప్పున, ఆమ్చూర్ పౌడర్- 2 టీ స్పూన్లు, మొక్కజొన్న పిండి - 2 టేబుల్ స్పూన్లు, గుడ్లు - 3, చిక్కటి పాలు - 1 టేబుల్ స్పూన్, ఉప్పు - తగినంత, నీళ్లు - అవసరాన్ని బట్టి, నూనె - డీప్ ఫ్రైకి సరిపడా తయారీ: ముందుగా పెద్ద బౌల్ తీసుకుని అందులో పనీర్ తురుము, జీడిపప్పు పేస్ట్, బ్రెడ్ పౌడర్, అల్లం-వెల్లుల్లి పేస్ట్, ఆమ్చూర్ పౌడర్, పచ్చిమిర్చి ముక్కలు, మిరియాల పొడి, జీలకర్ర పొడి, తగినంత ఉప్పు, పెరుగు, 2 కోడిగుడ్లు వేసుకుని బాగా కలుపుకోవాలి