తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం. విద్య సంస్థల ను తాత్కాలికంగా బంద్ చేస్తున్నట్లు వెల్లడి.

 


తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. కరోనా తీవ్రత అధికంగా ఉన్న నేపథ్యంలో బుధవారం నుంచి విద్యాసంస్థలు తాత్కాలికంగా బంద్ చేస్తున్నట్లు వెల్లడించింది. వైద్య కళాశాలలు మినహాయించి.. రాష్ట్రంలోని అన్ని గురకులు విద్యాలయాలు, హాస్టల్స్ కూడా మూసివేయనున్నారు. ఈ మేరకు అసెంబ్లీలో విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రా రెడ్డి ప్రకటన చేశారు. అయితే ఆన్‌లైన్ క్లాసులను యథాతథంగా జరగనున్నాయి. విద్యాసంస్థలు కరోనా విస్పోటన కేంద్రాలుగా మారిన నేపథ్యంలో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. విద్యార్థులు, ఉపాధ్యాయుల ఆరోగ్యాన్ని కూడా దృష్టిలో పెట్టుకున్నట్లు చెప్పింది. దేశంలోని చాలా రాష్ట్రాలు ఇప్పటికే ఈ తరహా నిర్ణయాలు తీసుకున్నాయని మంత్రి సబితా ఇంద్రా రెడ్డి చెప్పారు. ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలకు ప్రజలు సహకరించాలని మంత్రి కోరారు.