రాంచరణ్ చేతుల మీదగా "రిపబ్లిక్ "సినిమా ఫస్ట్ లుక్ విడుదల.

 


వెన్నెల తో ఒక్కసారిగా థియేటర్స్ లలో నవ్వుల పూయించిన దేవ కట్ట, ఆ తర్వాత ప్రస్థానం చిత్రంతో టాప్ దర్శకుల జాబితాలో చేరాడు. ఆ తరువాత నాగ చైతన్య తో ఆటో నగర్ సూర్య మూవీ చేసి ఘోర పరజేయని చవిచుసాడు, దాని తర్వాత కొంత గ్యాప్ తీసుకొని మంచు విష్ణు తో డైనమైట్ చిత్రాన్ని చేసి ప్లాప్ అయ్యాడు. చాలాకాలం విరామం తీసుకున్నాక సాయి ధరమ్ తేజ్ తో రిపబ్లిక్ సినిమా చేస్తున్నాడు. రేపు ఉదయం 10 గంటలకు ఈ చిత్రానికి సంబంధించిన ఫస్ట్ లుక్ ని రామ్ చరణ్ చేతుల మీదుగా విడుదల చేయనున్నాడు. ఈ చిత్రంలో సాయి ధరమ్ తేజ్ సరసన ఐశ్వర్య రాజేష్ హీరోయిన్‌గా నటిస్తోంది. భగవాన్, జె.పుల్లారావు నిర్మాతలుగా వ్యవహరిస్తున్న ఈ చిత్రాన్ని జూన్ 4వ విడుదల చేసేలా ప్లాన్ చేస్తున్నారు.