జీఎస్టి రిటర్నుల గడువు పెంపు.

 


జిఎస్‌టి, ఇ కామర్స్ సమస్యలపై 5 నుంచి నిరసన మార్చి 31 వరకు అవకాశం న్యూఢిల్లీ : గత ఆర్థిక సంవత్సరం (2019-20) జిఎస్‌టి వార్షిక రిటర్న్‌ల దాఖలుకు గడువు తేదీని ప్రభుత్వం పొడిగించింది. జిఎస్‌టి (వస్తు, సేవల పన్ను) రిటర్న్‌లకు మార్చి 31వరకు ప్రభుత్వం సమ యం ఇచ్చింది. గడువు పొడిగింపు ఇది రెండోసారి. గతంలో 2020 డిసెంబర్ 31 నుంచి ఫిబ్రవరి 28 వరకు గడువును ప్రభుత్వం పొడిగించింది. తక్కువ సమయంలో పన్ను చెల్లింపుపై ఎదుర్కొంటున్న సమస్యలను టాక్స్‌పేయర్స్ ప్రభుత్వం దృష్టికి తెచ్చారు. దీంతో 201920 ఆర్థిక సంవత్సరానికి జిఎస్‌టిఆర్9, జిఎస్‌టిఆర్9సి దాఖలుకు గడువును మరిం త పెంచాలని ప్రభుత్వం నిర్ణయించింది. దీనికి ఎన్నికల సంఘం కూడా అనుమతి ఇచ్చిందని కేంద్ర ఆర్థిక మంత్రిత్వశాఖ ప్రకటించింది. జిఎస్‌టి, ఇ కామర్స్ సమస్యలపై 5 నుంచి నిరసన న్యూఢిల్లీ : జిఎస్‌టి, ఇకామర్స్ సమస్యల పై మార్చి 5 నుంచి దేశవ్యాప్తంగా నిరసన చేపట్టాలని ట్రేడర్స్ బాడీ సిఎఐటి నిర్ణయించింది. జిఎస్‌టి(వస్తు, సేవల పన్ను)కి సంబం ధించిన సమస్యలు, విదేశీ ఇకామర్స్ సంస్థ ల తప్పుడు విధానాలు చేపడుతున్నాయని సిఎఐటి పేర్కొంది. మార్చి 5 నుంచి నిరసన ప్రారంభించి ఏప్రిల్ 5 వరకు కొనసాగిస్తామ ని ట్రేడర్స్ బాడీ తెలిపింది. జిఎస్‌టి, ఇకామర్స్ ఈ రెండు సమస్యలకు ప్రత్యక్షంగా దేశంలోని ఎనిమిది కీలక రంగాలకు సంబం ధం ఉందని, దీనికి తగిన పరిష్కారం చూపే ంత వరకు నిరసన కొనసాగిస్తూనే ఉంటామ ని సిఎఐటి వెల్లడించింది. అయితే ఫిబ్రవరి 26న సిఎఐటి (ఆన్ఫెడరేషన్ ఆప్ ఆల్ ఇండి యా ట్రేడర్స్) ఇచ్చిన 'భారత్ వ్యాపార్ బంద్'కు మంచి స్పందన వచ్చిందని సంస్థ తెలిపింది.