ఏపీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం.

 


విశాఖ వైపు జగన్ ప్రభుత్వం అడుగులు వేస్తోందా? అమరావతి మహానగరపాలక సంస్థ ప్రతిపాదనలకు తిలోదకాలు ఇవ్వడం ఇందుకేనా? అవుననే విశ్లేషకులు అంటున్నారు. విశాఖకు ప్రాధాన్యం ఇస్తూ.. అసలు అమరావతి అనే ఊసే లేకుండా చేసేలా వైసీపీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. అదే మంగళగిరి-తాడేపల్లి మున్సిపల్ నగరపాలక సంస్థ ఏర్పాటు... ఇప్పటికే గుంటూరు నగరపాలక సంస్థ ఉండగా మంగళగిరి-తాడేపల్లి మున్సిపాల్సీలను, సమీప గ్రామాలను విలీనం చేస్తూ మరో నగరపాలకకు ప్రభుత్వం జీవో జారీ చేసింది. దీంతో అమరావతిలో గుంటూరుకు తోడు మరో నగరపాలిక ఏర్పాటయింది. మంగళగిరి-తాడేపల్లి పట్టణాలతోపాటు సమీపంలోని 21 గ్రామాలను కలిపి ఎంటీఎంసీ పేరుతో మంగళగిరి-తాడేపల్లి మున్సిపల్ కార్పొరేషన్ ఏర్పాటు చేస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. మూడు రాజధానుల ప్రకటన, ప్రభుత్వ కార్యాలయాల తరలింపుతో అమరావతి అభివృద్ది సందిగ్ధంలో పడిపోయింది. ఎలాంటి సౌకర్యాలు లేకుండానే విశాఖకు ప్రాధాన్యం ఇస్తుండడంపై జగన్ ప్రభుత్వంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి.