'ఆచార్య' సినిమా నుండి ‘లాహే లాహే.. ‘ లిరికల్ సాంగ్ విడుదల.

 


మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న తాజా సినిమా ఆచార్య. కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా కోసం అభిమానులంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ సినిమాలో మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ కీలక పాత్రలో నటిస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటికే ఈ సినిమా టీజర్ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంటుంది. ఇటీవల రామ్ చరణ్ పుట్టిన రోజు కానుకగా చరణ్ లుక్ ను రిలీజ్ చేసింది చిత్రయూనిట్. తాజాగా ఈ సినిమా నుంచి ‘లాహే లాహే.. ‘అంటూ సాగే లిరికల్ సాంగ్ ను విడుదల చేశారు. ఆచార్య సినిమాకు మణిశర్మ సంగీతం అందిస్తున్నారు. ఈ చిత్రాన్ని మ్యాట్నీ ఎంటర్‌టైన్‌మెంట్‌, కొణిదెల ప్రొడక్షన్‌ కంపెనీ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ఇక ఈ సినిమాలో చిరుకు జోడీగా చందమామ కాజల్ అగర్వాల్ నటిస్తుంది. అలాగే చరణ్ కు హీరోయిన్ గా బుట్టబొమ్మ పూజ హెగ్డే నటిస్తుంది. ప్రస్తతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. ఈ చిత్రంలో చిరంజీవి, చరణ్ నక్సలైట్స్ గా కనిపించనున్నారు. తాజాగా విడుదల చేసిన లాహే లాహే… సాంగ్ పై మీరు ఓ లుక్కేయండి.