'ఆర్ఆర్ఆర్' సినిమా కు కొత్త కష్టాలు.లీక్ అయిన క్లైమాక్స్ ఫోటోలు.

 


దర్శకధీరుడు రాజమౌళి ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తోన్న చిత్రంం 'ఆర్ఆర్ఆర్'. ఈ చిత్రంపై ఇప్పుడు అన్ని ఇండస్ట్రీస్ కళ్లు పడి ఉన్నాయి. ముఖ్యంగా బాలీవుడ్.. ఈ సినిమాని ఎలాగైనా ఎదుర్కొవాలని చూస్తుంది. అందుకే ఈ సినిమాకి కొత్త కష్టాలు సృష్టించేలా ప్రయత్నాలు మొదలెట్టింది. 'ఆర్ఆర్ఆర్' సినిమాకు సంబంధించి కొన్ని కీలక ఫొటోలు బుధవారం సోషల్ మీడియాలో దర్శనమిచ్చాయి. ఈ ఫొటోలు ఎలా లీకయ్యాయి అంటూ.. 'ఆర్ఆర్ఆర్' దర్శకనిర్మాతలు ఎంక్వయిరీలు కూడా మొదలెట్టారు. అయితే బాలీవుడ్‌కి సంబంధించిన ఓ స్టూడియో ద్వారా ఈ ఫొటోలు లీకయ్యాయనేలా వార్తలు వినవస్తున్నాయి. ఈ వార్తల్లో నిజమెంత ఉందో తెలియాలంటే.. చిత్రయూనిట్ స్పందించే వరకు వెయిట్ చేయక తప్పదు. ఇక లీకైన ఫొటోల విషయానికి వస్తే.. ముఖ్యంగా యంగ్ టైగర్ ఎన్టీఆర్.. పులితో ఫైట్ చేస్తున్న ఫొటో ఒకటి బాగా వైరల్ అవుతుంది. అలాగే రామ్ చరణ్.. బ్రిటీష్ గెటప్‌లో ఉన్న ఫొటో, హాలీవుడ్‌ హీరోయిన్‌కి సంబంధించిన ఓ ఫొటో.. ఇంకా తారక్‌వి ఫైట్ సీక్వెన్స్ ఫొటోలు కొన్ని సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతున్నాయి. మరీ ముఖ్యంగా యంగ్ టైగర్ ఎన్టీఆర్.. పులితో చేసే ఫైట్ పిక్ మాత్రం.. సినిమాపై ఓ రేంజ్‌లో అంచనాలను పెంచేస్తోంది. వాస్తవానికి లీక్ చేసిన వారు ఏ ఉద్దేశ్యంతో లీక్ చేశారో.. తెలియదు కానీ.. ఈ లీక్స్ ఫొటోల ద్వారా సినిమాపై పాజిటివ్ ఇంపాక్ట్ పడుతుండటం విశేషం. అలాగే చరణ్ పిక్ కూడా.. అసలు ఆ ఫొటోలో ఉన్నది చరణేనా.. అనేలా చరణ్ మేకోవర్ ఉంది. ఏదిఏమైనా ఓ చారిత్రాత్మక నేపథ్యంతో తెరకెక్కుతున్న చిత్రానికి సంబంధించి ఇలాంటి లీక్స్.. సినిమాకి డ్యామేజ్ చేయడం ఖాయం. దీనిపై రాజమౌళి అండ్ టీమ్ అప్రమత్తతతో లేకుంటే ఇంకా డ్యామేజ్ జరిగే అవకావం ఉంది. కాబట్టి రాజమౌళి అండ్ టీమ్ వెంటనే రియాక్ట్ అయి.. ఈ లీకులకు కారణం ఎవరో కనిపెడితే బాగుంటుంది.. లేదంటే.. రిలీజ్ లోపు మరిన్ని లీక్స్ వచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే.. బాలీవుడ్ ఈ సినిమాపై ఉడికిపోతుంది. ఉత్తరాదిలో దక్షిణాది వాళ్ల పెత్తనం ఏంటి అనేలా.. 'ఆర్ఆర్ఆర్'ని కిల్ చేయడానికి బాలీవుడ్‌కి చెందిన కొందరు ప్రముఖులు ప్రయత్నిస్తున్న నేపథ్యంలో.. రాజమౌళి అండ్ టీమ్ ఇక్కడి నుంచి ప్రతీ అడుగూ చాలా కేర్ ఫుల్‌గా వేయాల్సి ఉంటుంది.