డ్రాగన్ కంటే మరో కుట్ర.

 


సిగ్నల్ యాప్​ను చైనా నిషేధించినట్లు సమాచారం. వీపీఎన్ లేకుండా ఈ యాప్​ను యాక్సెస్ చేయడం కష్టంగా మారింది. ఫేస్​బుక్, ట్విట్టర్ వంటి అంతర్జాతీయ సామాజిక మాధ్యమాల మాదిరిగానే దీనిపైనా ఆంక్షలు విధించినట్లు స్పష్టమవుతోంది. వాట్సాప్​కు ప్రత్యామ్నాయంగా టెస్లా సీఈఓ ఎలాన్ మస్క్ సిఫార్సు చేసిన ఎన్​క్రిప్టెడ్ మెసేజింగ్ యాప్-‘సిగ్నల్​’ను చైనా వేటు వేసినట్లుగా తెలుస్తోంది. చైనాలో ఈ యాప్​ను వర్చువల్ ప్రైవేట్ నెట్​వర్క్‌ లేనిదే యాక్సెస్ చేయడం కష్టంగా ఉంది. దీంతో ఇతర అమెరికా సామాజిక మాధ్యమాల మాదిరిగానే దీనిపైనా ఆంక్షలు విధించినట్లు కనిపిస్తోందని టెక్ విశ్లేషకులు అభిప్రాయ పడుతున్నారు. ఇప్పటికే ఫేస్​బుక్, ట్విట్టర్ వంటి అంతర్జాతీయ సామాజిక మాధ్యమాలను తమ పౌరులకు దూరంగా ఉంచింది డ్రాగన్ దేశం. ఇంటర్ నెట్‌పై పరిమితులు విధించేలా రూపొందించిన ‘గ్రేట్ ఫైర్​వాల్​’తో అనేక సైట్లను అడ్డుకుంటోంది అక్కడి సైబర్ విభాగం. నిషేధిత అంశాలపై చర్చించేందుకు రూపొందిన క్లబ్​హౌస్ అనే ఆడియో ప్లాట్​ఫాంను సైతం గత నెలలో నిలిపివేసింది చైనా. వాట్సాప్ ఇటీవల తీసుకొచ్చిన గోప్యతా విధానంతో చాలా మంది సిగ్నల్ వంటి ప్రత్యామ్నాయ యాప్​లను ఆశ్రయిస్తున్నారు. దీంతో సిగ్నల్ డౌన్​లోడ్​ చేసుకుంటున్నవారి సంఖ్య చైనాలో నెమ్మది నెమ్మదిగా పెరుగుతోంది. ఎలాన్ మస్క్ సైతం ఈ యాప్​ ఉపయోగించాలని సూచించడం వల్ల అంతర్జాతీయంగా ఈ మెసేజింగ్ యాప్​కు విశేష ప్రాచుర్యం లభించింది. దీంతో అయితే నిషేదం విధించినట్లుగా ఎలాంటి ప్రకటన చేయనప్పటికీ.. కట్టడి చేస్తున్నట్లుగా తెలుస్తోంది. అక్కడి సెర్చ్ ఇంజన్‌ ప్లే స్టోర్‌లో అది కనిపించడం లేదు. దీంతో సిగ్నల్‌పై అనధికారికంగా వేటు పడిందని అనుకుంటున్నారు. సహజంగా చైనా ప్రభుత్వం ఇలాంటి చర్యలు తీసుకున్న ఎలాంటి ప్రకటన చేయదని టెక్ విశ్లేషకులు అంటున్నారు.