ఇంగ్లాండ్‌తో జరిగిన మొదటి వన్డేలో టీమిండియా ఘన విజయం.

 


ఇంగ్లాండ్‌తో జరిగిన మొదటి వన్డేలో టీమిండియా ఘన విజయం సాధించింది. టీమిండియా నిర్దేశించిన 318 పరుగుల భారీ టార్గెట్‌ ఛేదించలేక పోయారు ఇంగ్లాండ్‌ ఆటగాళ్లు. 42.1 ఓవర్లలో 251 పరుగులకే ఆలౌటైంది. ఆల్‌రౌండ్‌ షోతో అదరగొట్టిన భారత్‌ 66 పరుగుల తేడాతో గెలుపొందింది. మూడు వన్డేల సిరీస్‌లో భారత్‌ 1-0తో ఆధిక్యం సాధించింది. అంతకు ముందు… ఇంగ్లాండ్​తో జరుగుతున్న తొలి వన్డేలో భారత్ నిర్ణీత 50 ఓవర్లలో 318 పరుగులు చేసింది. టీమిండియా బ్యాట్స్​మెన్​లో విరాట్, ధావన్, కృనాల్, రాహుల్ హాఫ్ సెంచరీలతో సత్తా చాటారు. ఇంగ్లాండ్‌తో జరుగుతున్న తొలి వన్డేలో కోహ్లీ సేన అదరగొట్టింది. 5 వికెట్ల నష్టానికి 317 పరుగులు చేసింది. ఓపెనర్‌ శిఖర్‌ ధావన్‌ 106 బంతుల్లో 98 పరుగులు చేశాడు. దూకుడుగా ఆడి హాఫ్ సెంచరీ అందుకున్నాడు. సెంచరీకి 2 పరుగుల దూరంలో ఔటయ్యాడు. సారథి విరాట్‌ కోహ్లీ దూకుడుగా ఆడి అర్ధశతకం చేయగా… చివర్లో కేఎల్‌ రాహుల్‌, కృనాల్‌ పాండ్య మెరుపులు మెరిపించారు. సిక్సర్లతో దుమ్ము రేపారు. భారత ఆటగాళ్లను కట్టడి చేయడంలో కొంత వరకు సక్సెస్ అయ్యారు ఇంగ్లాండ్ ఆటగాళ్లు. బెన్‌స్టోక్స్‌ 3, మార్క్‌వుడ్‌ 2 వికెట్లు తీశారు. వన్డేల్లో ఎంట్రీ ఎంట్రీ ఇచ్చిన కృనాల్‌ తీవ్ర భావోద్వేగానికి గురయ్యాడు. అతడు చేసిన హాఫ్ సెంచరీని కొన్నాళ్ల క్రితం మరణించిన తండ్రికి అంకితమిచ్చాడు.