లాభాల బాట పడుతున్న దేశీయ స్టాక్ మార్కెట్లు.

 


ముంబై: దేశీయ స్టాక్‌ మార్కెట్లు వరుసగా రెండో రోజూ లాభాల్లో కొనసాగుతున్నాయి. సోమవారం నాటి లాభాల పరంపర మంగళవారం కూడా కొనసాగుతున్నది. ఇవాళ సెన్సెక్స్‌ 50,258 వద్ద, నిఫ్టీ 14,865 వద్ద ప్రారంభమయ్యాయి. ఉదయం 10 గంటల సమయానికి సెన్సెక్స్ 400 పాయింట్లకు పైగా ఎగబాకి 50,300 వద్ద, నిఫ్టీ 120 పాయింట్లకు పైగా లాభపడి 14,900 వద్ద కొనసాగుతున్నాయి. డాలర్‌తో రూపాయి మారకం విలువ రూ.72.47గా ఉంది. ఇక, ఆసియా మార్కెట్లు స్వల్ప నష్టాల్లో సాగుతున్నాయి. జపాన్‌ మార్కెట్ల సూచీ నిక్కీ 0.4 శాతం, హాంకాంగ్‌ మార్కెట్‌ సూచీ హాంగ్‌ సెంగ్‌ 0.7 శాతం, షాంఘై కాంపోజిట్‌ 0.8 శాతం నష్టాల్లో ఉన్నాయి. దాదాపు అన్ని రంగాల షేర్లు లాభాల్లోనే నడుస్తున్నాయి. భారత్‌ పెట్రోలియం, ఐవోసీఎల్‌, బజాజ్ ఫైనాన్స్‌ లిమిటెడ్‌, టెక్‌ మహీంద్రా, అదానీ పోర్ట్స్‌ షేర్లు లాభాల్లో సాగుతుండగా ఓఎన్‌జీసీ, హిందాల్కో ఇండస్ట్రీస్‌, పవర్‌ గ్రిడ్‌ కార్పొరేషన్‌, హెచ్‌డీఎఫ్‌సీ, బజాజ్‌ ఆటో షేర్లు నష్టాల్లో ఉన్నాయి