సూపర్ స్టార్ మహేష్ బాబును డైరెక్ట్ చేస్తున్నా సందీప్ రెడ్డి వంగ.

 సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం పరశురామ్ దర్శకత్వం లో సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. సర్కారు వారిపాట అనే టైటిల్ తో తెరకెక్కుతున్న ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. ఈ సినిమాలో మహేష్ సరసన కీర్తి సురేష్ హీరోయిన్ గా నటిస్తుంది. బ్యాంకింగ్ రంగంలో జరిగే మోసాల నేపథ్యంలో ఈ సినిమా ఉండనుందని తెలుస్తుంది. ఈ మూవీలో మహేష్ సరికొత్త లుక్ లో కనిపించనున్నాడు. ఇప్పటికే షూటింగ్ స్పాట్ నుంచి లీక్ అయిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. మహేష్ ఫ్యాన్స్ ఆ ఫోటోలను తెగ షేర్ చేస్తున్నారు. ఇక ఈ సినిమా తర్వాత మహేష్ ఎవరితో నటించబోతున్నాడన్నదని ఫై క్లారిటీ రాలేదు. అయితే మహేష్ బాబు ఇప్పుడు మిల్కీ బ్యూటీ తమన్నా తో జోడీకట్టనున్నాడు. అయితే అది సినిమా కోసం కాదు ఓ యాడ్ షూట్ కోసం మహేష్, తమన్నా కలిసి నటించనున్నారు. ప్రముఖ ఎలక్ట్రికల్ లైట్స్ బ్రాండ్ కోసం వీరిద్దరూ యాడ్ ఫిల్మ్ చేయనున్నారు. అంతే కాదు ఈరోజు(16/03/21) మహేష్ షూట్ లో పాల్గొన్నాడట. ఈ యాడ్ ను క్రేజీ డైరెక్టర్ సందీప్ వంగ దర్శకత్వం వహించనున్నాడు. ఇక మహేష్ గతంలో శ్రీను వైట్ల దర్శకత్వంలో ఆగడు అనే సినిమా చేసాడు. ఈ సినిమాలో తమన్నా హీరోయిన్. ఇప్పుడు మరోసారి ఈ ఇద్దరు కలిసి కనిపించనుండటంతో అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఇక సందీప్ రెడ్డి బాలీవుడ్ లో ‘యానిమల్’ అనే సినిమా చేస్తున్నాడు. అలాగే తమన్నా టాలీవుడ్ లో సినిమాలు చేస్తుంది. ప్రస్తుతం ఈ అమ్మడు చేతిలో సీటీమార్ సినిమా, అలాగే సత్యదేవ్ తో నటిస్తున్న ‘గుర్తుందా శీతాకాలం’ అనే సినిమాలు ఉన్నాయి.