పాకిస్తాన్ చైనా మధ్య కోల్డ్ వార్.

 


ఆ ఇద్దరి మధ్య కొనసాగుతున్న లవ్ స్టోరీకి చిన్న బ్రేక్ పడింది. ఓ చిన్న వీడియో ట్వీట్ పెద్ద రచ్చకు కారణంగా మారింది. అయితే ఈ వీడియో ఇరు దేశాల మధ్య పెద్ద కోల్డ్ వార్‌కు దారి తీసింది. పాకిస్తాన్ ప్రజలు అగ్గిమీద గుగ్గిలం అవుతున్నారు. అది కూడా పాకిస్తాన్‌లోని చైనా రాయబారి చేసిన ట్వీట్ ఓ పెద్ద రచ్చకు కారణంగా మారింది. చైనా దౌత్యవేత్త చేసిన వివాదం కాస్తా ప్రధాని ఇమ్రామన్ ఖాన్ వద్దకు చేరింది. ‘హిజాబ్’కు సంబంధించిన ట్వీట్ వివాదంను విదేశాంగ మంత్రిత్వ శాఖ ఆ దేశ ప్రధాని ఇమ్రాన్ ఖాన్‌ దృష్టికి తీసుకువెళ్లింది. “హిజాబ్” గురించి కామెంట్ చేయడం అంటే “ఇస్లాం” పై దాడిగా పేర్కొన్నారు అక్కడి విదేశాంగ మంత్రిత్వ శాఖ. వాస్తవానికి, చైనాలో ముస్లిం మైనారిటీల పరిస్థితి చాలా దయనీయంగా ఉంది.