తెలంగాణ ప్రభుత్వంపై హైకోర్టు ఆగ్రహం.

 


రాష్ట్ర ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేసిన తెలంగాణ హైకోర్టు.. ప్రశ్నల వర్షం కురిపించింది... వక్ఫ్‌ బోర్డు స్థలాల ఆక్రమణలపై ఇవాళ హైకోర్టులో విచారణ జరిగింది.. ఈ సందర్భంగా మొత్తం 2,186 వక్ఫ్‌ బోర్డు ఆస్తులు ఆక్రమణలకు గురైనట్లు గుర్తించామని హైకోర్టు దృష్టికి తీసుకెళ్లింది రాష్ట్ర ప్రభుత్వం.. అయితే, అందులో ఎన్ని స్వాధీనం చేసుకున్నారో చెప్పాలని ప్రశ్నించింది హైకోర్టు.. దీనిపై సరైన సమాధానం లేకపోవడంతో.. ఆస్తుల స్వాధీనం వివరాలు లేకపోవడంపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇక, ప్రత్యేక టాస్క్‌ఫోర్స్ ఏర్పాటు చేశారా? అని విచారణ సందర్భంగా ప్రశ్నించిన హైకోర్టు.. టాస్క్‌ఫోర్స్‌లో ఎంతమంది ఉన్నారు? ఎన్ని ఆస్తులు స్వాధీనం చేసుకున్నారు? అని ప్రశ్నించింది.. జిల్లాల వారీగా వివరాలు సమర్పించాలని ఆదేశించిన హైకోర్టు.. ఈ కేసులో తదుపరి విచారణను జూన్ 10వ తేదీకి వాయిదా వేసింది