"జాతిరత్నాలు"సినిమా నుండి మరో క్రేజీ పాట విడుదల.

 
కుర్ర హీరో నవీన్ పోలిశెట్టి, ప్రియా దర్శి, రాహుల్ రామకృష ప్రధాన పాత్రలో నటించిన సినిమా జాతిరత్నాలు. అనుదీప్ దర్శకత్వం వహించిన ఈ సినిమా మహాశివరాత్రి కానుకగా విడుదలైంది. ఈ సినిమాకు మహానటి ఫెమ్ నాగ్ అశ్విన్ నిర్మాతగా వ్యవహరించాడు. ఇక ఈ సినిమా సంచలన విజయాన్ని నమోదు చేసుకుంది. విడుదలై వారం రోజులు గడుస్తున్నా థియేటర్స్ అన్ని హౌస్ ఫుల్ అవుతున్నాయి. అవుట్ అండ్ అవుట్ కామెడీ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన ఈ సినిమాలో పాటలు కూడా అంతే ఆదరణ దక్కించుకుంటున్నాయి. ముఖ్యంగా చిట్టి సాంగ్ కు విపరీతమైన రెస్పాన్స్ వస్తుంది. ఈ సాంగ్ ను రామ్ మిరియాల ఆలపించారు. క్రేజీ లిరిక్స్ తో సాగిన ఈ పాట యువతను ఆకట్టుకుంటుంది. విడుదలకు ముందు నుంచే ఈ సినిమాపై అంచనాలు పీక్స్ చేరాయి. అలాగే రిలీజ్ తర్వాత తన సత్తా చాటుతూ, కలెక్షన్స్‌లోనూ ఔరా అనిపిస్తుంది. ‘ఏజెంట్ సాయి శ్రీనివాస్ ఆత్రేయ’ వంటి సూపర్ హిట్ తర్వాత నవీన్ పోలిశెట్టి నటించిన సినిమా కావడంతో జాతిరత్నాలు పై ప్రేక్షకులు మంచి అంచనాలనే పట్టుకున్నారు. ఆ అంచనాలకు ఎక్కడ తగ్గకుండా అలరిస్తుంది సినిమా. తాజాగా జాతి రత్నాలు నుంచి మరో సాంగ్ ను రిలీజ్ చేశారు. అరెరే జాతిరత్నాలు అనే పాటను మరోసారి రామ్ మిర్యాల ఆలపించారు. ఈపాటను కొద్దిసేపటి క్రితమే చిత్రయూనిట్ విడుదల చేసింది. ఈ పాట కూడా శ్రోతలను ఆకట్టుకుంటుంది. తనదైన శైలిలో పాటను ఆలపించి మరోసారి మ్యాజిక్ చేసాడు రామ్ మిరియాల ఈ పాట పై మీరు ఓ లుక్కేయండి.. జాతిరత్నాలు కొత్త పాట: