‘వైల్డ్‌ డాగ్‌’ సినిమా ట్రైలర్ విడుదల చేసిన మెగాస్టార్ చిరంజీవి.

 


హైదరాబాద్‌ గోకుల్‌ ఛాట్‌లో ప్రజలంతా పనీపూరి, ఛాట్‌ తింటూ సంతోషంగా గడుపుతున్నారు.. ఒక్కసారిగా భారీ బాంబ్‌ బ్లాస్ట్‌ జరిగింది. రెండు వారాలు గడుస్తోన్నా ఆ ఘాతుకానికి ఒడిగట్టింది ఎవరో నగర పోలీసులు తేల్చలేకపోతున్నారు. దీంతో అధికారులు ఎన్‌ఐఏ సాయం తీసుకోవాలనుకున్నారు. ఈ క్రమంలోనే ఆ బాంబును పేల్చింది ఎవరో తేల్చడానికి ఎన్ఐఏలో ఉన్న ది బెస్ట్‌ ఆఫీసర్‌ విజయ్‌ వర్మ రంగంలోకి దిగాడు. నాగార్జున హీరోగా తెరకెక్కుతోన్న ‘వైల్డ్‌ డాగ్‌’ సినిమా కథ ఒక్క మాటలో చెప్పాలంటే ఇదే. కింగ్‌ నాగార్జున హీరోగా వాస్తవ కథ ఆధారంగా తెరకెక్కుతోన్న చిత్రం ‘వైల్డ్‌డాగ్‌’. ఈ సినిమాలో నాగ్‌ ఏసీపీ విజయ్‌ వర్మ పాత్రలో నటిస్తున్నాడు. హైదరాబాద్‌ నగరంలోని కోఠిలో ఉన్న గోకుల్‌ ఛాట్‌లో 2013లో జరిగిన బాంబు దాడిని ఆధారం చేసుకొని ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. విడుదలకు ముందే ఈ సినిమా ప్రేక్షకుల్లో క్యూరియాసిటీ పెంచేసింది. ఇదిలా ఉంటా తాజాగా ఈ చిత్ర ట్రైలర్‌ను విడుదల చేశారు. మెగా స్టార్‌ చిరంజీవి ట్విట్టర్‌ వేదికగా ‘వైల్డ్‌ డాగ్‌’ సినిమా ట్రైలర్‌ను విడుదల చేయడం విశేషం.