ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్‌లో రెండో స్థానానికి ఎగబాకిన టీమిండియా.

 


ఇంగ్లాండ్‌తో జరిగిన వన్డే సిరీస్‌ను 2-1తేడాతో కైవసం చేసుకున్న భారత జట్టు.. ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్‌లో రెండో స్థానానికి ఎగబాకింది. ఇంగ్లండ్‌తో టెస్టు(3-1), టీ20(3-2) సిరీస్‌లను సైతం కైవసం టీమిండియా టెస్టుల్లో అగ్రస్థానంలో, టీ20ల్లో రెండో స్థానంలో కొనసాగుతోంది. టీమిండియా చేతిలో వన్డే సిరీస్‌ కోల్పోయినప్పటికీ.. ఇంగ్లాండ్‌ 121 రేటింగ్‌ పాయింట్లతో అగ్రస్థానాన్ని నిలబెట్టుకుంది. వన్డే సిరీస్‌లో అద్భుత ప్రదర్శన కనబర్చిన కోహ్లి సేన.. న్యూజిలాండ్‌(118)ను మూడో స్థానానికి నెట్టి 119 పాయింట్లతో రెండో స్థానానికి దూసుకెళ్లింది. బంగ్లాదేశ్‌తో జరిగిన వన్డే సిరీస్‌ను 3-0తో వైట్‌వాష్‌ చేసిన న్యూజిలాండ్‌ 118 పాయింట్లకు మాత్రమే పరిమితమై మూడో స్థానంతో సరిపెట్టుకుంది.