ఆఖరి వన్డేలో భారత అమ్మాయిల జట్టు ఓటమి.

 


లక్నో: దక్షిణాఫ్రికా మహిళల జట్టుతో జరిగిన ఆఖరి వన్డేలోనూ భారత అమ్మాయిల జట్టు ఓటమిపాలైంది. బుధవారం లక్నోలో జరిగిన మ్యాచ్‌లో సౌతాఫ్రికా 5 వికెట్ల తేడాతో గెలుపొందింది. అన్ని విభాగాల్లో ఆల్‌రౌండ్‌షోతో అదరగొట్టిన సౌతాఫ్రికా ఐదు వన్డేల సిరీస్‌ను 4-1తో కైవసం చేసుకున్నది. రెండో వన్డేలో మాత్రమే భారత్‌ స్థాయికి తగ్గ ప్రదర్శన చేసి విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్‌ చేసిన భారత మహిళల జట్టు 49.3 ఓవర్లలో 9 వికెట్లకు 188 పరుగులు చేసింది. కెప్టెన్‌ మిథాలీ రాజ్‌(79 నాటౌట్‌) ఒంటరి పోరాటం చేయగా హర్మన్‌ప్రీత్‌ కౌర్‌(30) రిటైర్డ్‌హర్ట్‌గా వెనుదిరిగింది. టాప్‌ ఆర్డర్‌ బ్యాట్స్‌వుమెన్‌ తేలిపోవడంతో జట్టు స్కోరు కనీసం 200 కూడా దాటలేదు. సఫారీ బౌలర్లలో డీ క్లెర్క్‌ మూడు వికెట్లు తీయగా షాంగసే, సెకుక్‌నే చెరో రెండు వికెట్లు దక్కించుకున్నారు. అనంతరం లక్ష్య ఛేదనలో సౌతాఫ్రికా మిడిలార్డర్‌ బ్యాట్స్‌వుమన్‌ ఆకట్టుకున్నారు. డూప్రెజ్‌(), అన్నే బాష్‌() అర్ధశతకాలో విజృంభించారు. ఇన్నింగ్స్‌ ఆఖర్లో కాప్‌(36 నాటౌట్‌), డీ క్లెర్క్‌(19 నాటౌట్‌) చివరి వరకు నిలువడంతో దక్షిణాఫ్రికా లక్ష్యాన్ని మరో 10 బంతులు మిగిలుండగానే 5 వికెట్లు కోల్పోయి ఛేదించింది. భారత బౌలర్లలో రాజేశ్వరీ గైక్వాడ్‌ మూడు వికెట్లు పడగొట్టింది.