ఆదిలాబాద్‌ జిల్లా భీంపూర్‌ మండలం పిప్పల్‌కోటిలో అగ్ని ప్రమాదం .

 


ఆదిలాబాద్‌ జిల్లా భీంపూర్‌ మండలం పిప్పల్‌కోటిలో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. కార్మికుల శిబిరంలో ఆదివారం ప్రమాదవశాత్తు గ్యాస్‌ సిలిండర్‌ పేలడంతో ఓ వ్యక్తి సజీవదహనం కాగా, నాలుగు టిప్పట్లు, ట్రాక్టర్‌ పూర్తిగా దగ్ధం అయ్యాయి. మరో ఇద్దరు కార్మికులు మంటల్లో చిక్కుకున్నట్లు తెలుస్తోంది. ఈ ప్రమాదంలో మంటలు భారీగా ఎగిసిపడుతున్నాయి. ప్రమాదం కారణంగా చుట్టు పక్కల ప్రాంతాలకు అగ్నీకీలకాలు వ్యాపించాయి. ఘటన స్థానినికి చేరుకున్న అగ్ని మాపక సిబ్బంది మంటలను అదుపులోకి తెచ్చే ప్రయత్నం చేస్తున్నారు. ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు ప్రమాదం జరగడానికి గల కారణాలపై ఆరా తీస్తున్నారు. మంటలు భారీగా ఎగిసి పడటంతో చుట్టుపక్కల ప్రాంతాల ప్రజలు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. ఈ కాగా, ఈ మధ్య కాలంలో ప్రమాదవశాత్తు సిలిండర్లు పేలడం చాలా పెరిగిపోతున్నాయి. ఈ ప్రమాందలో ఎందరో ప్రాణాలు పోగొట్టుకుంటున్నారు. సిలిండర్లను వినియోగించే ముందు ఎన్నో జాగ్రత్తలు చేపట్టాలని తెలిసినా.. అనుకోని విధంగా ప్రమాదాలు జరుగుతూ భారీగా ప్రాణ నష్టం, ఆస్తి నష్టం సంభవిస్తున్నాయి. ఇలాంటి కొన్ని ప్రమాదాల్లో అమాయకులు బలవుతున్నారు. రోజువారీ పనులు చేసుకుంటేనే జీవనం గడిచే పరిస్థితి ఉన్నకార్మికులు సైతం బలవుతున్నారు.