నాగార్జున సరసన హీరోయిన్ కాజల్.

 


టాలీవుడ్ చందమామ కాజల్ అగర్వాల్ పెళ్లి తర్వాత జోరు పెంచింది. ఇప్పటికే మెగాస్టార్ చిరంజీవి.. కొరటాల శివ కాంబినేషన్లో తెరకెక్కుతున్న ఆచార్య సినిమాలో నటిస్తొంది. అంతేకాకుండా.. మంచు విష్ణు ప్రధాన పాత్రలో రూపొందిస్తున్న మోసగాళ్లు సినిమాలో నటిస్తుంది ఈ ముద్దుగుమ్మ. తాజాగా ఈ ముద్దుగుమ్మ మరో ప్రాజెక్టుకు ఓకే చెప్పిసింది. ఈ విషయాన్ని స్వయంగా ఆ చిత్రయూనిట్ ప్రకటించింది. నాగార్జున ప్రధాన పాత్రలో డైరెక్టర్ ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో ఓ మూవీ చేస్తున్న సంగతి తెలిసిందే. ఇందులో నాగ్ సరసన కాజల్ నటించబోతున్నట్లుగా గత కొన్నిరోజులుగా వార్తలు వచ్చాయి. తాజాగా ఆ వార్తలను నిజం చేస్తూ.. అఫిషీయల్‏గా ప్రకటించింది చిత్రయూనిట్. ప్రస్తుతం షూటింగ్ గోవాలో జరుగుతుంది. గోవా షెడ్యూల్ పూర్తైన త‌ర్వాత మిగిలిన చిత్రీక‌రణ కోసం నాగ్ టీం హైద‌రాబాద్‌కు రానుంది. మార్చి 31 నుంచి ఈ సినిమా చిత్రీకరణంలో కాజల్ పాల్గొననుంది. ఇందులో నాగ్ చెల్లెలిగా చంఢీఘర్ భామ, మిస్ ఇండియా టైటిల్ విన్నర్ గుల్‌పనాగ్‌, మేనకోడలి పాత్రలో మలయాళీ నటి అనిఖ నటిస్తోంది. ఇటీవలే నాగార్జున వైల్డ్ డాగ్ షూటింగ్ పూర్తిచేసుకున్నాడు. ఇందులో నాగ్ ఎన్ఐఏ ఆఫీసర్ గా కనిపించనున్నాడు. ‘హైదరాబాద్‌లో జరిగిన బాంబు పేళుళ్ల గురించి అందరికీ తెలిసిందే. ఈ అంశాన్ని ఆధారంగా చేసుకునే ‘వైల్డ్ గాడ్’ చిత్రాన్ని తెరకెక్కించారు. ఈ సినిమాను వేసవి కానుకగా ఏప్రిల్‌ 2న ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి చిత్ర యూనిట్‌ సన్నాహాలు చేస్తోంది. నిజానికి ఈ సినిమాను తొలుత ఓటీటీ వేదికగా విడుదల చేయాలని భావించారు. కానీ లాక్‌డౌన్‌ ఎత్తివేయడం, థియేటర్లు మళ్లీ ప్రారంభం కావడంతో చిత్ర యూనిట్‌ తమ ఆలోచనను మార్చుకుంది. అటు కాజల్ తెలుగులోనే కాకుండా తమిళంలోనూ రెండు సినిమాలకు ఓకే చెప్పిందట. అంతేకాకుండా.. ఈ టీవి షోకు కూడా హోస్ట్ గా చేయనున్నట్లుగా సమాచారం.