టీఎస్‌ ఐసెట్‌ షెడ్యూల్‌ విడుదల.

 


టీఎస్‌ ఐసెట్‌ షెడ్యూల్‌ (2021-22)ను రాష్ట్ర ఉన్నత విద్యా మండలి విడుదల చేసింది. ఏప్రిల్‌ 3న ఐసెట్‌ నోటిఫికేషన్‌ విడుదల చేయనున్నట్లు ఉన్నత విద్యా మండలి పేర్కొంది. ఏప్రిల్‌ 7 నుంచి జూన్‌ 15 వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తులు స్వీకరించనున్నట్లు తెలిపింది. పరీక్ష ఫీజును రూ.650గా నిర్ణయించింది. ఎలాంటి అపరాధ రుసుము లేకుండా జూన్‌ 15 వరకు అప్లికేషన్లు తీసుకోనున్నట్లు పేర్కొంది. అలాగే ఆలస్య రుసుముతో అభ్యర్థులు జులై 30 వరకు దరఖాస్తు చేసుకునేందుకు అవకాశం కల్పించింది. జూన్ 30 వరకు రూ.250 అపరాధ రుసుము, జులై 15 వరకు రూ.500 అపరాధ రుసుము, జూలై 30 వరకు రూ.1000 అపరాధ రుసుముతో అప్లికేషన్లు తీసుకోనున్నట్లు వెల్లడించింది. ఇక ఆగస్టులో మూడు సెషన్‌లలో ఐసెట్‌ నిర్వహించనున్నట్లు తెలిపింది. కేవలం అన్‌లైన్‌ ద్వారా మాత్రమే పరీక్ష నిర్వహించనున్నట్లు ఉన్నత విద్యామండలి తెలిపింది. ఎంబీఏ, ఎంసీఏ కళాశాలల్లో సీట్ల భర్తీ కోసం విద్యాశాఖ ఐసెట్‌ నిర్వహిస్తున్న విషయం తెలిసిందే.