ఎగ్ లెస్ ఆమ్లెట్ తయారు చేయు విధానం

 


అవును మీరు చదివింది కరెక్టే.. ఎగ్‌లెస్‌ కేక్‌ తిన్నాం కానీ.. ఎగ్‌ లేకుండా ఆమ్లెట్‌ ఏంటీ అనుకుంటున్నారా... మొక్కల ప్రొటీన్లతో తయారు చేసే ఆమ్లెటే ఎగ్‌లెస్‌ ఆమ్లెట్‌. దీనినే వీగన్‌ ఆమ్లెట్‌ అని కూడా అంటారు. ఈ మధ్యకాలంలో ప్రపంచవ్యాప్తంగా వినిపిస్తున్న డైట్‌ 'వీగన్‌ డైట్‌'. ఈ ఆహారపు ముఖ్య లక్ష్యం.. మనిషి తిండికోసం ఏ జీవినీ బాధించకపోవడమే.. అందుకే వీగన్‌ డైట్‌ ఫాలోవర్స్‌ అంతా మాంసం, గుడ్డు, చేపలు, పాలు, పెరుగు, వెన్న, జున్ను, తేనె వంటివేవీ ఆహారంగా తీసుకోరు. అయితే ఈ డైట్‌ ఫాలో అయ్యే వాళ్ల కోసం ముంబై కేంద్రంగా పనిచేస్తోన్న 'ఇవో ఫుడ్స్‌' అనే ఓ స్టార్టప్‌ రెస్టారెంట్‌ మొక్కల ప్రొటీన్ల నుంచి వీగన్ ‌ ఎగ్స్‌ను తయారు చేసి వాటితో ఆమ్లెట్స్, ఎగ్‌రోల్స్, వివిధ రకాల ఎగ్‌వెరైటీ డిష్‌లను అందిస్తోంది.